ఏపీని 2029 నాటికి అగ్రస్థానంలో నిలపాలన్నదే తమ లక్ష్యం:సీఎం

28

ఏపీని 2022 నాటికి దేశంలో మూడో స్థానంలో… 2029 నాటికి అగ్రస్థానంలో నిలపాలన్నదే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానమని. మూడోసారి సీఐఐ సదస్సు నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. గతేడాది కంటే ఈసారి స్పందన బాగుందని చంద్రబాబు అన్నారు. ఏపీలో శాశ్వత కన్వెన్షన్ సెంటర్‌, షాపింగ్ మాల్స్, హోటళ్లు ఏర్పాటు, రాష్ట్రంలో భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని, ఈసారి రాష్ట్రంలో 13.8 శాతం లోటు వర్షపాతం నమోదన్నారు. వ్యవసాయంలో గణనీయ వృద్ధిరేటు సాధిస్తున్నామని, నీటి నిర్వహణ పద్ధతుల ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని చంద్రబాబు వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here