ఈ -ప్రగతిని సాంకేతికతతో పటిష్టం చేయాలి: సీఎం

ఈ – ప్రగతి పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. రియల్ టైమ్ గవర్నెన్స్ తో ఈ- ప్రగతిని అనుసంధానించాలని, దీని వల్ల మంచి ఫలితాలను సాధించాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా ఈ- ప్రగతిని మరింత పటిష్టం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముప్ఫైకి పైగా ప్రభుత్వ శాఖలు, నూటా ముప్ఫైకి పైగా ప్రభుత్వ విభాగాధిపతులు, ఎనిమిది వందల సూచికల్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత చేరువవ్వాలని..ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. 15 శాతం స్థిరమైన వృద్ధి రేటును సాధించడానికి ఈ చర్యలన్నీ ఉపయోగపడాలని సీఎం కోరారు. రాష్ట్రంలో చేపడుతున్న వినూత్న సంక్షేమ కార్యక్రమాలు, పారదర్శక పాలన కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటుండం చూసి ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబాని కొనియాడిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు.

సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటూ చేపడుతున్న చర్యలు అటు అధికారులకు, ఇటు ప్రజలకు తెలియాలంటే శిక్షణ కార్యక్రమాలు విరివిరిగా జరగాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ- ప్రగతి సమీక్షా సమావేశంలో ఐటీ ముఖ్యకార్యదర్శి విజయానంద్, ఈ – ప్రగతి సీఈవో బాలసుబ్రహ్మణ్యం, రియల్ టైమ్ గవర్నెన్స్ సీఈవో బాబు అహ్మద్, ముఖ్యమంత్రి కార్యదర్శి గిరిజా శంకర్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *