సింగపూర్ ఆర్థికమంత్రితో సీఎం చంద్రబాబు భేటీ

58

రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సింగపూర్‌లో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. మంగళవారం సింగపూర్ ఆర్థికమంత్రి హుంగ్ స్వీకేట్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. మెరుగైన సేవలకోసం సాంకేతికతను గరిష్టస్థాయిలో వాడుతున్నామని, అన్ని రకాల పౌర సేవలను ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకువచ్చామని సీఎం తెలిపారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నదే తమ తపన అని పేర్కొన్నారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించామని చెప్పారు. సెన్సార్ల ఆధారిత వీధి దీపాల వ్యవస్థను రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టామన్నారు.ఇస్రో సహకారంతో రైతులకు వాతావరణ సూచనలు అందజేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.అనేక దిగ్గజ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. ఏపీలో కియా మోటార్స్‌ రెండు బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టిందని వివరించారు. 2019 నాటికి కియా ఉత్పత్తి ప్రారంభిస్తోందన్నారు. వాణిజ్యం, పెట్టుబడుల ఆకర్షణలో ఆదర్శనీయంగా ఉన్నామని అన్నారు. తమ వ్యాపారాల్లో సింగపూర్‌ భాగస్వామిగా వుండాలని కోరుతున్నామని తెలిపారు. తక్కువ వడ్డీతో సింగపూర్‌ సంస్థలు రుణాలు ఇచ్చేలా చూడాలని సీఎం చంద్రబాబు వినతి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here