క్రమశిక్షణకు మారుపేరుగా హోంగార్డులు-చంద్రబాబు

38

రాష్ట్రంలో హోంగార్డులు క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటున్నారని సిఎం చంద్రబాబు అభినందించారు. రౌడీయిజం ఉండటానికి వీల్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో సోమవారం నిర్వహించిన హోంగార్డుల ఆత్మీయ సభలో సీఎం పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డులను, పోలీసులకు వేరుగా చూడటం లేదన్నారు.ఇది సన్మాన సభ కాదని.. హోంగార్డుల చైతన్య సభ అని పేర్కొన్నారు. కేంద్ర సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.ఆర్థిక వ్యవస్థ సహకరిస్తే మొట్టమొదట హోంగార్డులనే ఆదుకుంటామని హామీ ఇచ్చారు.శాంతి భద్రతలను కాపాడటంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుకోవాలని సీఎం పోలీసుశాఖకు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here