చంద్రబాబుకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది!

35

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడుకు వ‌రుస గండాలు ఎదుర‌వుతున్నాయి. గ‌తంలో సీఎంగా ఉన్న స‌మ‌యంలోనే ఆయ‌న‌ను హ‌త్య చేసేందుకు నిషేధిత మావోయిస్టులు కుట్ర ప‌న్నారు. త‌న సొంత జిల్లా చిత్తూరులోని తిరుప‌తి నుంచి తిరుమ‌ల వెళుతున్న చంద్ర‌బాబును టార్గెట్ చేసిన మావోయిస్టులు… ఘాట్ రోడ్డులో క్లెమోర్ మైన్ బాంబు పెట్టి పెల్చారు. ఈ ప్ర‌మాదంలో చంద్ర‌బాబు ప్ర‌యాణిస్తున్న కారు గాల్లోకి లేచి ప‌ల్టీలు కొట్టి కింద ప‌డింది.

తాజాగా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన చంద్ర‌బాబుకు మ‌రో గండం ఎదురైంది. ఢిల్లీలో జ‌రుగుతున్న ఇండోసాన్ ఎగ్జిబిష‌న్ లో పాల్గొనేందుకు వెళ్లిన చంద్ర‌బాబు… అక్క‌డి స్టాళ్ల‌ను ప‌రిశీలించిన అనంత‌రం అక్క‌డే మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ స‌మ‌యంలో ఒక్క‌సారిగా పెద్ద పేలుడు శ‌బ్ధం వినిపించింది. గ్యాస్ సిలిండ‌ర్ పేలుడు కార‌ణంగా వినిపించిన ఈ శ‌బ్దానికి చంద్ర‌బాబు కూడా ఉలిక్కిప‌డ్డారు. వెనువెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన ఆయ‌న భ‌ద్ర‌తా సిబ్బంది చంద్ర‌బాబును అక్క‌డి నుంచి బ‌య‌ట‌కు తీసుకుని వ‌చ్చారు. ఎగ్జిబిష‌న్ లో ఏర్పాటు చేసిన సెంట్ర‌లైజ్డ్ ఏసీ కోసం వినియోగిస్తున్న గ్యాస్ సిలిండ‌ర్ పేలింద‌ట‌. గ్యాస్ లీకైన కార‌ణంగానే పేలుడు సంభవించిన‌ట్లు స‌మాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here