భారీ అవినీతి చేస్తూ, రాష్ట్రాన్ని దోచేస్తున్న చంద్రబాబు- సునీల్ ధియోధర్

93

ప్రకాశం జిల్లా చీరాలలో బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బిజెపి కో-ఇన్-ఛార్జ్ సునీల్ ధియోధర్ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో గొప్ప నాయకుడైన ఎన్టీఆర్ గారిని ఆయన అల్లుడైన చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇస్తున్న నిధులను దోచేస్తూ ‘చందాబాబు’ గా మారారని విమర్శించారు. చంద్రబాబు అత్యంత అవినీతి పరుడైన ముఖ్యమంత్రి అని, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, తాజాగా రూ.53,000 కోట్ల పి.డి అకౌంట్ల కుంభకోణం వెలుగిలోకి వచ్చిందని తెలిపారు. కేంద్రంపై టిడిపి చేస్తున్న దుష్ప్రచారం తిప్పికొడుతూ, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సహాయం గురించిన వివరాలు సమర్దవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని కార్యకర్తలకు సూచించారు.కార్యకర్తలు పార్టీకి పునాదులు అని, రానున్న రోజుల్లో ఎక్కడా వెనుకడుగు వేయకుండా అనునిత్యం పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేయాలనీ సూచించారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీని పటిష్ట పరిచేందుకు కృషిచేయాలని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here