‘ప్రత్యేక హోదా’ ఇచ్చేదాకా వదలిపెట్టను : సీఎం

33

.

కేంద్రం న్యాయం చేయాలి ఐదు కోట్ల ఆంధ్రులది ఒకే మాట
‘సాధికారమిత్ర’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు

 

తన వెనుక నాలుగు లక్షలమంది ‘సాధికార మిత్ర’లు ఉన్నారని, వారే తన సైన్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

బుధవారం గుంటూరు జిల్లా ఉండవల్లిలోని గ్రీవెన్స్ సెల్ హాలులో ‘సాధికార మిత్ర’లతో ఏర్పాటు చేసిన మాటా మంతీ కార్యక్రమంలో ప్రసంగిస్తూ సాధికార మిత్రలు నాలుగు లక్షల తన సైన్యమని అన్నారు. స్వయం సహాయక సంఘాలలో చురుకైన, చదువుకున్న మెరికల్లాంటి వారిని సాధికార మిత్రలుగా ఎంపిక చేశామన్నారు.

ప్రతి ఒక్క సాధికార మిత్ర తాను నివసిస్తున్న ప్రాంత పరిధిలో 35 కుటుంబాలను ఎంచుకుని వారిలో ప్రభుత్వ పథకాలపై చైతన్యం నింపాలని, నెలకు రూ 10 వేల ఆదాయాన్ని ఆర్జించడానికి ప్రభుత్వం అమలుచేస్తున్న పేదరిక నిర్మూలన కార్యక్రమాలలో వారిని భాగస్వాములను చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ ఏడాది నిర్వహించిన రెండు కార్యక్రమాలైన జన్మభూమి-

మా ఊరు, సాధికారమిత్ర లు తనకెంతో సంతృప్తినిచ్చాయని అన్నారు. సాధికారమిత్రలు జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో చురుకైన పాత్ర పోషించారని సీఎం అభినందించారు.

మహిళాభ్యుదయం కోసం సాధికారమిత్రల ఏర్పాటు తాము చేపట్టిన వినూత్న కార్యక్రమమని అభివర్ణించారు. ఇదొక సంఘటిత శక్తి అని, సమష్టిగా పనిచేస్తే గ్రామసీమల్లో సమస్యలే ఉండవని అన్నారు. సమస్యలు ఉంటాయని,

వాటిని అధిగమించడానికి తెలివిని ఉపయోగించాలని చెప్పారు. ఒకప్పుడు అనంతపురం జిల్లా ఎడారిగా ఉండేదని, కరవునేలగా పిలిచిన అనంతపురాన్ని తాము ఉద్యానవనంలా తీర్చిదిద్దామని, శ్రీశైలం నుంచి నీరు తీసుకొచ్చి చెరువులను నింపితే భూగర్భ జల మట్టాలు పెరిగాయని,

ఇక అనంతపురంలో కరవు కనపడదని, రాళ్లసీమ అని పిలిచే రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

కోస్తా ఆంధ్రజిల్లాలకంటే రాయలసీమలో భూగర్భజల మట్టాల పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు.పట్టిసీమ ప్రాజెక్టును నిర్మించి కృష్ణా డెల్టాకు ఊపిరి పోశామని, గోదావరి జలాలతో కృష్ణా డెల్టాలో గతంలో కంటే రైతులు అధికదిగుబడులు

సాధించారని గుర్తు చేశారు. జలవనరుల అభివృద్ధికి రూ 53 వేల కోట్లు వ్యయం చేశామని, ఎన్నడూ లేని విధాం రాయలసీమకు 145 టీఎంసీల నీరిచ్చామని చంద్రబాబు తెలిపారు.

వర్షాలు సకాలంలో పడకపోయినప్పటికీ వ్యవసాయంలో 25.6% వృద్ధి రేటును సాధించినట్లు చెప్పారు. ఒక సంకల్పం, ఒక ప్రయత్నంతో ఇది సాధించినట్లు తెలిపారు. లక్షల మంది ఆలోచనలతో సమష్టిగా పనిచేస్తే రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేయవచ్చని ముఖ్యమంత్రి సాధికార మిత్రలకు ఉద్బోధించారు.

కార్యక్రమాలకు కొనసాగింపు ఉండాలని, ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే శ్రద్ధపెట్టి ఫలితాలు వచ్చే వరకు కొనసాగిస్తే సత్ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి అన్నారు. మహిళలు జీవితంలో వివిధ దశలలో ఒకరిపై ఆధారపడి జీవించే పరిస్థితి పోవాలని.

ఈరోజు 90 లక్షల మంది డ్వాక్రా మహిళలు తనకు అండగా ఉన్నారని చెప్పారు. సమాజంలో మహిళలకు సముచితమైన స్థానం ఉండాలన్నదే తన అభిమతమని, వారు ఆనాడు ఇబ్బందులలో ఉన్నారని స్వయం సహాయక సంఘాలకు రూ 10 వేల సహాయం ప్రకటించానని అన్నారు.

మార్చి 8 మహిళా దినోత్సవం నాడు మూడో విడత ‘పసుపు కుంకుమ’ కింద ప్రతి సభ్యురాలికి 2 వేల చొప్పున 86 లక్షల మందికి 2 వేల 21 కోట్లు వారి ఖాతాలకు జమ చేస్తామన్నారు. రూ.24 వేల కోట్ల విలువైన రైతు రుణమాఫీని చేసిన ప్రభుత్వం దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వానికి రైతాంగంపై ఉన్న ప్రేమకు, మా నిబద్ధతకు ఇది నిదర్శనమని చంద్రబాబు అన్నారు. ఇంటికి పెద్దకొడుకుగా ఉంటానని ఆరోజు మాట ఇచ్చానని, మాట నిలబెట్టుకుంటూ రూ.200 గా ఉన్న సామాజకి భద్రత పెన్షన్‌ను ఐదు రెట్లు చేసి రూ.1000 ఇస్తున్నామని, వికలాంగులకు రూ.1500 పెన్షన్ ఇస్తున్నట్లు, మొత్తం 45 లక్షలమందికి పైగా సామాజిక భద్రతా పెన్షన్లు ఇస్తున్నామన్నారు. పరిమితి లేకుండా పేద కుటుంబాల్లో మనిషికి 5 కిలోల బియ్యం ఇస్తున్నామని,

అడిగిన వారందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్న విషయాలను గుర్తుచేశారు. ఎవరికైనా సరిగ్గా పెన్షన్లు రాకున్నా, ప్రభుత్వ పథకాలు సరిగ్గా అమలు జరగకున్నా పరిష్కార వేదిక ద్వారా 1100 కు ఫోన్ చేసి తమకు ఫిర్యాదు చేయాలన్నారు.

ఒకప్పడు కార్యాలయాలకు సర్టిఫికెట్ల కోసం కాళ్లరిగేలా తిరిగే పరిస్థితి ఉండేదని, ఆధునిక సాంకేతికత ఆధారంగా ఇ-పరిపాలన, ఈ-సేవ, ఆన్ లైన్ విధానంతో అలాంటి దుస్థితిని తొలగించినట్లు చంద్రబాబు గుర్తు చేశారు.

స్వయం సహాయక సంఘాలు, డ్వాక్రా సంఘాలు, సాగునీటి సంఘాలు, గ్రామాల్లో జన్మభూమి కమిటీలు కలసి పనిచేస్తే అద్భుతాలు సాధించవచ్చన్నారు. రైతులను ఒప్పి

ంచి 33 వేల ఎకరాల భూమిని సమీకరణ ద్వారా రాజధాని అమరావతికోసం తీసుకున్న విషయాన్ని చెబుతూ సంక్షోభాన్ని అభివృద్ధికి అవకాశంగా మలిచామని అన్నారు.

గర్భిణులు రక్తహీనతతో ఉంటే పుట్టే శిశువుల ఎదుగుదలపై దుష్ర్పభావం పడుతుందని, బరువు పెరగరని, వయసుకు తగినట్లు ఎదగరని అన్నారు. గ్రామాల్లో సాధికార మిత్రలు అంగన్ వాడీల ద్వారా ప్రభుత్వం పోషకాహారాన్ని గర్భిణులకు, శిశువులకు ఉచితంగా అందిస్తున్న విషయంపై చైతన్యం కలిగించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. గ్రామానికి ఎకరం, రెండు ఎకరాలు భూమిని తీసుకుని గర్భిణులకు, శిశువులకు పౌష్టికాహారం అందించేందుకు ఉపయోగించవచ్చని సూచించారు.

పేదవారికి అండగా ఉంటామని, ఆడపిల్లలు ధైర్యంగా తిరగాలన్నదే తమ అభిమతమని, రౌడీ షీటర్ల ఫొటోలన్నింటినీ ఆన్ లైన్ లో పెడతాం అటువంటి వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నామని చంద్రబాబు అన్నారు.

భవిష్యత్తులో కోటిమందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి చరిత్ర సృష్టిస్తామని చెప్పారు. గర్భిణుల్లో ఆత్మస్థయిర్యం నింపేందుకే సీమంతం కార్యక్రమం ప్రవేశపెట్టామని అన్నారు. సాధికారమిత్రలకు నెలరోజులు పరీక్ష పెడుతున్నాం ప్రతి ఒక్క సాధికార మిత్ర అన్ని 35 కుటుంబాలను కలవాలని, గర్భిణులకు,

పిల్లలకు పౌష్టికాహారం అందించడానికి తోడ్పడాలన్న ఇతివృత్తాలతో తాను సాధికార మిత్రలకు 10 కార్యక్రమాలను ఇస్తానని, మీ పరిధిలోని ఐదు లేదా 10 కుటుంబాల ఆదాయం పెంచే మార్గం చూపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
పాలకుల తప్పులకు ప్రజలను బలి చేయవద్దు

కేంద్రం ఇచ్చిందాకా పోరాడతాను, వదిలిపెట్టను
ముఖ్యమంత్రి చంద్రబాబు …దయచేసి పాలకుల తప్పులకు ప్రజలను బలిచేయవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దక్షిణ భారతదేశంలో మిగిలిన రాష్ట్రాలతో సమానంగా పైకి వచ్చేవరకు కేంద్రం సహాయం చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. తర్వాత అంతే ప్రయోజనం కలిగించే ప్యాకేజీ ఇస్తామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం అంగీకరించామని, అదీ నెరవేరలేదని, మూడేళ్లుగా ఎటువంటి సహకారం అందడం లేదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా మన హక్కు. మనకు ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. కొందరు కేవలం ప్రత్యేక హోదా గురించే మాట్లాడుతూ కొన్ని విషయాలను

మరుగుపరుస్తున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. కేంద్రం నిధులు ఇవ్వకుంటే వదిలిపెట్టే సమస్యేలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇచ్చేదాకా పోరాడతానని అన్నారు. ‘మీకు బాధ్యత ఉంది. చట్టంలో పేర్కొన్నవన్నీ అమలు చేయాలి.

ఐదు కోట్ల మంది ఆంధ్రలది ఒకే మాట. కేంద్రం న్యాయం చేయాలి’ అని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్రం సహాయం చేసిందాకా వదలిపెట్టం. పోరాడతాం. చట్టంలో ఉన్నవి అమలు చేయాలి. చారిత్రక తప్పిదాలు చేసిన కాంగ్రెస్‌ ‌ను చిత్తుచిత్తుగా ఓడించిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here