పరిశ్రమల స్థాపనతోనే నిజమైన రాష్ట్ర అభివృద్ధి 

పరిశ్రమల స్థాపనతోనే  నిజమైన   రాష్ట్ర  అభివృద్ధి సాధ్యమవుతుందనే ఉద్దేశ్యంతోనే  పారిశ్రామిక రంగానికి  ప్రోత్సాహాన్నిస్తూ  అభివృద్ధి దిశగా  పయనిస్తున్నామని రాష్ట్ర  ముఖ్య మంత్రి  నారా  చంద్ర బాబు నాయుడు అన్నారు. మంగళవారం మధ్యాహ్నం వరదయ్యపాలెం  మండలం చిన పాండూరు  వద్ద అపోలో  టైర్స్ పరిశ్రమకు  ముఖ్యమంత్రి  శంఖుస్థాపన  చేశారు. ఈ సందర్బంగా   ఏర్పాటు  చేసిన  సభలో ప్రసంగిస్తూ  హేతుబద్దత  లేకుండా  విడిపోయిన రాష్ట్రం అని  బాధ పడుతూ  కూర్చోవడం  కంటే,  కొత్త జీవితాన్ని ప్రారంభించాలని  నిర్ణయించుకున్నానని అన్నారు. రాష్ట్రం కోసం విజన్  తయారు చేసుకున్నాం  2021 నాటికి దేశంలో  3 రాష్ట్రాల్లో ఒకటిగా 2029 నాటికి దేశం లో మొదటి రాష్ట్రంగా  2050 నాటికి ప్రపంచం లో మొదటిదిగా  ఐటి రంగానికికి ప్రాధాన్యత నిచ్చి  ఎకనామిక్ స్టేట్ గా తయారు చేయనున్నామని అన్నారు. వెయ్యి కిలోమీటర్ల  తీర  ప్రాంతం మన రాష్ట్రానికి  వుంది,  పోర్టులు వున్నాయి వ్యవసాయ రంగం అభివృద్ధి, రాష్ట్రంలో  శాస్వతంగా  పరిశ్రమలు నెలకొనాలని   అన్నారు. మన రాజధానికి అమరావతికి పూర్వకాలంలో  ఒకప్పుడు వ్యాపార కేంద్రం అనే గొప్ప చరిత్ర వుంది అన్నారు. మంచి పేరున్న  కంపెనీలు  వస్తున్నాయి.  మన రాష్ట్రం లోనే యువతకు ఉపాధి దొరుకుతుందని బయటి ప్రాంతాలకు వెళ్ళనవసరం  అన్నారు.  నేడు శంఖుస్థాపన చేసిన అపోలో టైర్స్  సంస్థకు  భారత దేశంలో 4, యూరప్  కంట్రీ లలో  2 వున్నాయి.  నేడు ఇది  7 వ తయారీ కేంద్రం. రూ  1800 కోట్లు పెట్టుబడి తో 700 మందికి ఉపాధి అవకాశం  వస్తుందని  200 ఎకరాలలో  వున్న ఈ పరిశ్రమ ప్రారంభ అనంతరం త్వరలో 5000 కోట్లతో విస్తరిస్తారు అన్నారు.  వీటి అనుబంధ పరిశ్రమలు చిన్న చిన్నవి వస్తాయి, పరోక్షంగా  ఉపాధి అవకాసాలు కలుగుతాయి  అన్నారు.

ప్రక్కనే హీరో మోటార్స్ పనులు జరుగుతున్నాయి.  సత్యవేడు   పరిశ్రమలకు  నిలయం కాబోతుంది  అన్నారు.  అధికారులు  శ్రమిస్తున్నారు . అనంతపురంకు  కియా మోటార్స్ వచ్చే  వరకు రాత్రింబవళ్ళు  పరిశ్రమల సెక్రటరీ  సాల్మాన్ ఆరోగ్య రాజ్ కష్టపడ్డారు  అన్నారు.

ఒక్క శ్రీ సిటీ లోనే 63 పరిశ్రమలు 24,600 కోట్ల పెట్టుబడులతో 3 ½  సంవత్సరములలో వచ్చాయి  అన్నారు. భవిష్యత్ లో సత్యవేడు  ఒక ఆదర్శ  ప్రాంతంగా  రూపుదిద్దుకోనున్నదని  అన్నారు.  ఇక్కడ నుండే ఎగుమతులు చేయాలి.  రాబోవు కాలానికి  ఎలెక్ట్రికల్  వాహనాలదే  హవా,  ఆ దిశగా కూడా అడుగులు  వేస్తున్నాము.   పరిశ్రమల అనుమతుల విషయం లో ఈజ్ ఆఫ్ డూయింగ్  అమలు తో దేశంలో 2015 మొదటి  సంవత్సరం రెండవ స్థానం లో ఉండేది. తరువాత 2016, 2017   సంవత్సరాలలో  అది  ఒకటవ స్థానానికి వచ్చింది.  సింగల్ విండో అనుమతులే దీనికి  ప్రధానం అన్నారు.  పరిశ్రమల అనుమతులలో  పారదర్సకత  రూపకల్పన చేసాము అన్నారు. మనకు  అన్ని రకాల వసతులు అందుబాటులో ఉన్నాయి.   కరెంటు , నీళ్ళు, రోడ్లు వంటి సౌకర్యాలు మనకు  వున్నాయి అన్నారు. బయో టెక్నాలజీ , టెక్స్టైల్ పార్క్స్ . ఫుడ్ పార్కులు ,  ఎలక్ట్రిక్ వాహనాల తయారికి సింగల్ విండో అనుమతులతో పారిశ్రామిక రంగం  దూసుకు పొతున్నది అన్నారు.  విశాఖపట్నం లో  ఇప్పటికే  రెండు సార్లు   పెద్ద ఎత్తున  పాశ్రిశ్రామిక సదస్సులు రెండు జరిగాయి. 927 పరిశ్రమలకు  రూ 3,62,132  కోట్ల పెట్టుబడులు  7,72,490  ఉద్యోగాల కల్పన  విదంగా డి పి ఆర్ రూపొందించాం .రాబోవు  ఫిబ్రవరి మాసంలో   మరో మారు విశాఖలో  3వ పారిశ్రామిక సదస్సు జరగనున్నదని అన్నారు.   ఇక్కడున్న  శ్రీ సిటీ ఆదర్శంగా దేశంలో నిలిచినది .  సంపద  సృష్టి  ప్రధాన లక్ష్యం అన్నారు. ముఖ్యమంత్రి  అపోలో టైర్స్  చైర్మన్  మేనేజింగ్  డైరెక్టర్  కు ఓంకార్ కన్వర్  ను 365 రోజుల్లో  పరిశ్రమల స్థాపన పూర్తీ అయ్యి  ఉత్పత్తులు ప్రారంభించాలని  కోరారు. పరిశ్రమల శాఖ  మంత్రి అమర్ నాద రెడ్డి  మాట్లాడుతూ  రాష్ట్ర  విభజన  తరువాత  వేల కోట్ల పెట్టుబడులు ముఖ్య మంత్రి నాయకత్వం  లో  వస్తున్నాయి.  పారిశ్రామిక వేత్తలు   ఆంధ్ర ప్రదేశ్ వైపు  చూస్తున్నారు.  సమర్థ నాయకత్వంతో   కొత్త రాష్ట్రం  ఎలా అనే భయం మనకు  పోయింది అన్నారు.

రాబోవు ఫెబ్రవరి   24,25,26 తేదీలలో  3 వ సారి  సదస్సు నిర్వహించానున్నాము  అన్నారు. రాయలసీమ  పరిశ్రమలకు అనువైన స్థలం  పారిశ్రామిక  హబ్  గా రూపు దిద్దుకుంటుందన్న విషయంలో  సందేహం  లేదు అన్నారు.

శ్రీ సిటీకి మంచి గుర్తింపు వచ్చింది అన్నారు.  పంచాయతి రాజ్ శాఖ  మంత్రి  నార లోకేష్  మాట్లాడుతూ  అపోలో టైర్స్  అంతర్జాతీయ  పరిశ్రమ శంఖుస్థాపన మనకు  ఒక చారిత్రిక  దినం అన్నారు.  విజన్ తాయారు చేసుకున్నాము,  ఆ దిశగా  రాష్ట్రాన్ని  అభివృద్ధిపథం లో నడిపిస్తున్నామని అన్నారు.

అమరావతి రాజధాని ప్రపంచ స్థాయి గుర్తింపు తో  నిర్మించుకోబోతున్నామని  అన్నారు.

ఈ కార్యక్రమం లో  అస్పోలో

టైర్స్  మేనేజింగ్  డైరెక్టర్ ఓంకార్ కన్వర్, వైస్ చైర్మన్  నీరజ్ కన్వర్, ప్రెసిడెంట్  సతీష్ శర్మ, పరిశ్రమల శాఖ  సెక్రటరీ  సాల్మన్ ఆరోక్య రాజ్ , జిల్లా కలెక్టర్  పి ఎస్ ప్రద్యుమ్న , సబ్ కలెక్టర్ నిశాంత్ కుమార్, అర్బన్ ఎస్ పి అభిషేక్ మహంతి  పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ నిశాంత్ కుమార్, అర్బన్ ఎసిపి పర్యవేక్షణ కార్యక్రమం విజయవంతానికి  కృషి చేసి అన్ని వర్గాల నుండి  మన్ననలందుకున్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *