అనంతపురం పోలీసు హెడ్ క్వార్టర్స్ మతసామరస్యానికి ప్రతీక


అనంతపురం జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్ వెల్లడించారు. పోలీసు హెడ్ క్వార్టర్స్ లో పునరుద్ధరించిన క్రీస్తు ప్రార్ధనా మందిరాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో హిందువుల కోసం కోదండ రామాలయం… ముస్లింల కోసం దర్గా…క్రైస్తవుల కోసం క్రీస్తు ప్రార్థనా మందిరాలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఆయా మతాలకు సంబంధించిన పర్వదినాలు, సాధారణ రోజుల్లో భక్తి భావం కల్గిన పోలీసు కుటుంబాలు ఎక్కడికి వెళ్లకుండా వారి వారి పద్ధతుల్లో దేవున్ని కొలుచుకునేలా… ప్రార్థనలు చేసుకునేలా సౌకర్యాలు కల్పించామన్నారు. జిల్లా పోలీసు సిబ్బంది, కుటుంబాలు మతసామరస్యం పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కోరారు. జిల్లాలో పోలీసు సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమానికి కొదవు లేదన్నారు. ప్రస్తుతం జిల్లాలో చాలా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. జిల్లా పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం గతంలో కృషి చేసిన అధికారుల ఆశయాలను ఆదర్శంగా చేసుకుని ప్రతీ ఎస్పీ తనదైన శైలిలో సంక్షేమానికి దోహదపడుతున్నారన్నారు. ఈకార్యక్రమంలో ఓఎస్డీ ఐశ్వర్య రస్తోగి, అదనపు ఎస్పీ కె మాల్యాద్రి, డిఎస్పీలు బి మల్లికార్జున, జె వెంకట్రావు, వెంకటరమణ, చిన్నికృష్ణ, సి.ఐ సుబ్బరాయుడు, ఆర్ ఐ లు వెంకటేశ్వర్లు, సోమశేఖర్ నాయక్ , ఆనంద్ , జాన్ జోసఫ్ , జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు సాకే త్రిలోక్ నాథ్ , కార్యనిర్వాహక కార్యదర్శి సుధాకర్ రెడ్డి, ఇ.సి సభ్యులు మసూద్ వలీ, ఫాస్టర్లు ఐజయ్య, జయకుమార్ , అనిల్ మోసెస్ , తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *