కండలు పెంచుతున్న అఖిల్

65

akhil

అఖిల్  కొత్త సినిమాకు రెడీ అవుతున్నాడు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా పట్టాలెక్కించడానికి అక్కినేని నాగార్జున అన్ని కార్యక్రమాలు ఇప్పటికే పూర్తి చేశారు. విక్రమ్ కె.కుమార్ డైరెక్షన్లో ఈ చిత్రం పట్టాలెక్కనుంది. రొటీన్ సినిమాలకు భిన్నంగా సినిమాలను తీసే డైరెక్టరుగా విక్రమ్ కు పేరుంది. ఇప్పటికే నాగార్జునతో మనం చిత్రాన్ని… సూర్యతో 24 చిత్రాలను తెరకెక్కించి విలక్షణ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. మరి అఖిల్ తో ఎలాంటి చిత్రాన్ని తెరకెక్కించున్నాడో ఈ విలక్షణ దర్శకుడు. వేచి చూడాలి. అఖిల్ మాత్రం తన దేహదారుఢ్యాన్ని చక్కగా మలచుకోవడానికి తయారవుతున్నాడు. ఇప్పటికే జిమ్ లో గంటలు గంటలు గడుపుతున్నాడట. ప్రత్యేక ట్రైనర్ సమక్షంలో జిమ్ చేస్తున్న ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియలో హల్ చల్ చేస్తోంది. ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న అఖిల్.. త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కనున్నాడు. ఈ లోగా ఈ చిత్రాన్ని కూడా పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నాడు. పెళ్లిలోగా… ఓ  షెడ్యూల్ ను కంప్లీ చేసేయాలనేది వీరి ప్లాన్. మరి అన్నీ కుదిరితే ఈ మూవీని దసరాకు తీసుకురావాలని అనుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here