7 భాషల్లో విడుదల కానున్న ‘రెడ్’

89

బ్లాక్ బస్టర్ హిట్ ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ హీరోగా నటించిన ‘రెడ్’ చిత్రం ఈ నెల 14 న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. మాళవికా శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్ ఇందులో కథానాయికలు. తిరుమల కిషోర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంఫై ‘స్రవంతి’ రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
చిత్ర సమర్పకులు కృష్ణ పోతినేని మాట్లాడుతూ “రామ్ ద్విపాత్రాభినయం చేసిన తొలి చిత్రం ఇది. ఇటీవల విడుదల చేసిన టీజర్, theatrical ట్రైలర్,పాటలకు అధ్భుతమైన స్పందన లభిస్తోంది” అని చెప్పారు.
నిర్మాత ‘స్రవంతి’ రవి కిషోర్ మాట్లాడుతూ “ఈ చిత్రాన్ని ఏడు భాషల్లో అనువదించాం. కన్నడం,మలయాళం,బెంగాలీ,
భోజ్ పురి ,మరాఠీ,తమిళం తో పాటు హిందీ లోకి కూడా డబ్ చేశాం. కన్నడ వెర్షన్ ఈ నెల 14 నే విడుదల కానుంది. మిగిలిన వెర్షన్ లను ఈ నెలాఖరున రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాం. తమిళ వెర్షన్ ని మాత్రం డైరెక్ట్ గా ఓటిటి లో విడుదల చేస్తున్నాం. రామ్ కి ఇతర భాషల్లో పెరిగిన మార్కెట్ రీత్యా ఇలా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాం. కచ్చితంగా ఈ సినిమా అన్ని భాషల ప్రేక్షకులనీ ఆకట్టుకుంటుంది. అలాగే తెలుగు వెర్షన్ గ్రేట్ ఇండియాఫిల్మ్స్ ద్వారా ఓవర్సీస్ లో కూడా విడుదల చేస్తున్నాం. అమెరికా తో పాటు ఆస్ట్రేలియా,సింగపూర్,దుబాయి లలో రిలీజ్ చేస్తున్నాం. వసూళ్ల కోణంలో కాకుండా ప్రేక్షకులకు theatrical ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశం తోనే ఆయా ఏరియాల పరిస్థితుల్ని బట్టి కొన్ని కొన్ని చోట్ల విడుదల చేస్తున్నాం. ఇంకొన్ని థియేటర్లు పెంచమని అడుగుతున్నారు. ఏది ఏమైనా ‘రెడ్’చిత్రం ఈ సంక్రాంతికి మంచి అనుభూతిని అందిస్తుంది” అని తెలిపారు.

న‌టీన‌టులు:
రామ్‌, నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌, నాజ‌ర్ తదితరులు

సాంకేతిక నిపుణులు:
సంస్థ‌: శ‌్రీ స్ర‌వంతి మూవీస్‌, సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి, ఆర్ట్: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్: పీటర్‌ హెయిన్స్, ఎడిటింగ్‌: జునైద్‌, సమర్పణ: కృష్ణ పోతినేని, నిర్మాత: ‘స్రవంతి’ రవికిశోర్‌, దర్శకత్వం: కిశోర్‌ తిరుమల.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here