7న పోలవరానికి వైసీపీ బస్సుయాత్ర

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్‌ జగన్‌గారి ఆదేశాల మేరకు ఈ నెల 7న వైయస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్‌ నాయకులు పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక పథకం ప్రకారం చేతులెత్తే స్తూదానికి శాశ్వతంగా సమాధికట్టేలా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ దుర్మార్గ వైఖరిని ప్రజల కళ్లకు కట్టినట్టు వివరించటానికి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్ళేలా ఒత్తిడి చేయటానికి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. రాష్ట్రానికి జీవనాడి అయిన ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించి అనుమతులతో ముందుకు వెళ్లటమే కాకుండా కుడి, ఎడమ కాల్వల నిర్మాణం దాదాపు 70 నుంచి 80 శాతాన్ని పూర్తి చేసిన డాక్టర్‌ వైయస్సార్‌గారి వారసులుగా ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలందరి అత్యంత ప్రాధాన్య అవసరంగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. చంద్రబాబు నాయుడు మాట మారుస్తూ పోలవరానికి శాశ్వతంగా సమాధి కట్టేందుకు, కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు పిండుకుని ఈ ప్రాజెక్టును ఇప్పుడు వదిలేసేందుకు పన్నాగం పన్నారని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మొదటినుంచి చెపుతూ వస్తోంది. పోలవరం ప్రాజెక్టును రక్షించుకునేందుకు, సత్వరం నిర్మించుకునేందుకు అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకు వచ్చేలా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాచరణ రూపొందించుకుంది. ఈ కార్యాచరణలో భాగంగా సీనియర్‌ నాయకుల పోలవరం యాత్రను రూపకల్పన చేయటం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *