పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఈనెల 7న వైసీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఈమేరకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా, బొత్స వెంటే మేమంతా ఉంటామంటూ ఏపీ కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి ఎడ్ల రమణమూర్తి ప్రకటించారు. దీంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.