5 నుంచి అసెంబ్లీ- 8న రాష్ట్ర బడ్జెట్

ఆంధ్ర ప్రదేశ్‌ శాసనసభ, శాసనమండలి సమా వేశాలు వచ్చే నెల 5 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.4, 5 లను విడుదల చేసింది. శాసనసభ, శాసనమండలి సమావేశాలు వెలగపూడిలోని సచివా లయంలో ప్రారంభం కానున్నయి. మార్చి 5వ తేదీ సోమవారం ఉదయం 9.30 గంటలకు నుంచి శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయని గురువారం విడుదల చేసిన జీవోల్లో ప్రభుత్వం పేర్కొంది. కాగా మార్చి 8వ తేదిన ఏపీ బడ్జెట్‌ను అసెంబ్లిలో ప్రవేశ పెట్టాలని ఇప్పటికే ప్రభుత్వ నిర్ణయించడం జరిగింది. మార్చి 28వ తేదీ దాకా బడ్జెట్‌ సమావేశం జరుగుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *