400 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టించిన గ్రామస్తులు

14

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు నుండి గత రెండేళ్లుగా రేషన్ బియ్యం దొంగచాటుగా విక్రయిస్తున్న దళారులను ఉప్పుగుండూరు గ్రామం పెద్దలు ఎంతో చాకచక్యంగా నిఘా వేసి వెంటాడి మరీ పట్టుకున్నారు.

రెండు మినీ టక్కులు ఒక్క మినీ లారీ మొత్తం మూడు వాహనాలలో ఉప్పుగుండూరు రేషన్ డీలర్ వద్ద అన్లోడ్ చేసుకొని నాగులుప్పలపాడు జంక్షన్ కు వచ్చాయి అక్కడినుండి రెండు వాహనాలు ఒంగోలు వైపు వెళుతుండగా గ్రామస్తులు వెంటాడి మండల తాసిల్దార్ కార్యాలయం సమీపంలో వాహనాలను ఆపారు ఒక వాహనం తిమ్మన పాలెం చెక్పోస్ట్ గ్రోత్ సెంటర్ వైపు పరారై పోగా ఒక వాహనాన్ని నాగులుప్పలపాడు చెక్పోస్ట్ సమీపంలో వాహనాలకు గాలి తీశారు రెండో వాహనాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో నిలిపివేశారు అనంతరం రెండు వాహనాల డ్రైవర్లు పరారయ్యారు.

గ్రామస్తుల కథనం మేరకు గత రెండు మూడు సంవత్సరాల నుంచి విచ్చలవిడిగా మండలంలో ఉన్న అన్ని గ్రామాల డీలర్లు ఈ రేషన్ బస్తాలను ఉప్పుగుండూరు కి తరలిస్తారు అక్కడ నుండి మెయిన్ డీలర్ వాటిని అర్ధరాత్రి సమయంలో ఊరు దాటేస్తాడు. ఈ విషయాలు ఎన్ని సార్లు అధికారులకు చెప్పిన డీలర్ల మామూలు మత్తులో పడి పట్టీపట్టనట్లు గా వ్యవహరిస్తున్న విషయాన్ని గమనించి గ్రామస్తులు అయినా మేము ప్రభుత్వం అందించే రేషన్ బియ్యాన్ని పేద ప్రజలకు కాకుండా పక్కదారి పట్టిస్తున్న డీలర్లను ప్రత్యేకమైన నిఘాతో పట్టుకున్నాము అన్నారు.

ఈ రేషన్ బియ్యం తరలింపు విషయం గ్రామంలో ఉన్న మండలం లో ఉన్న ప్రతి ఒక్క అధికారులకు ప్రజలకు పూర్తిగా తెలిసిన విషయమే కానీ రెండేళ్ల నుంచి ఇలా జరుగుతున్న ఎందుకు పట్టించుకోవడం లేదని ఈ విషయం పూర్తిగా తేలేవరకు ఈ రేషన్ బియ్యం అక్రమంగా తరలించే విషయంలో ఎంతమంది అధికారులు ప్రభుత్వ నాయకులు రాజకీయ నాయకులు చేతులు ఉన్నాయి పూర్తిగా తేలే వరకు ఉప్పుగుండూరు గ్రామస్తులు అయిన మేము అందరం గట్టి సంకల్పంతో ఉంటామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here