25 నుంచి దుర్గగుడిలో శాకంబరి ఉత్సవాలు

42

విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఈ నెల 25 నుంచి 27 వరకు శాకంబరి ఉత్సవాలు నిర్వహించనున్నారు.పండ్లు, కూరగాయలతో ఈ మూడు రోజులూ అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులు విరాళాలు కూడా ఇవ్వొచ్చని దేవస్థానం అధికారులు తెలిపారు. మరోవైపు చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 27న దుర్గగుడిని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఆ రోజు మధ్యాహ్నం 3గంటలకు గుడిని మూసివేయనున్నారు. మరుసటి రోజు (28న) ఉదయం 10 గంటల నుంచి దర్శనానికి భక్తులకు అనుమతిస్తామని దేవస్థానం అధికారులు వెల్లడించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here