23 రకాల పంటలకు కనీస మద్ద‌తు ధర అమలు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 83శాతం విస్తీర్ణంలో పండే 23 రకాల పంటలకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్ధత్తు ధరను (ఎంఎస్‌పి) ప్రకటించి అమలు చేయడం జరుగుతోందని నీతి ఆయోగ్ సభ్యుడు ప్రొపెసర్ రమేశ్‌చంద్ తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో అమలు చేస్తున్న జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం పరిస్థితులను పరిశీలించేందుకు వచ్చిన ఆయన శుక్రవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకృతి వ్యవసాయంలోను, టెక్నాలజీ వంటి రంగాల్లో దేశంలో మిగతా రాష్ట్రాల కంటే ముందు ఉందన్నారు. ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో అనేక ఉత్తమ విధానాల (బెస్ట్ ప్రాక్టీసెస్)ను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. వివిధ పంటలకు గిట్టుబాటు ధరను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 23 రకాల పంటలకు కనీస మద్ధత్తు ధరను ప్రకటించి అమలు చేయడం జరుగుతోందని దానివల్ల రైతులకు ఎంతగానో ప్రయోజం కలుగుతోందని చెప్పారు. రైతు ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర బడ్జెట్లో అనేక పధకాలను ప్రవేశపెట్టడం జరిగిందని పంట దిగుబడులకు అనుగుణంగా ధరల స్థిరీకరణకు కూడా అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఫసల్ భీమా యోజన ద్వారా రైతులకు తగిన బరోసా కల్పించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. కేంద్ర ఆహార శుద్ధి సంస్ధ (పుడ్ ప్రాసెసింగ్) వద్ద పెద్ద ఎత్తున నిధులు అందుబాటులో ఉన్నాయని వాటిని వినియగెగించుకుని పంటలను నిల్వ చేసుకునేందుకు అవసరమైన కోల్డు స్టోరేజిలు, గిడ్డంగులు వంటివి నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, రైతులు ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఉందని రమేశ్‌చంద్ సూచించారు.
రైతుల ఆత్మహత్యల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏవిధమైన సూచనలు, సలహాలను అందిస్తారని విలేఖరులు అడిగిన ప్రశ్నలకు రమేశ్‌చంద్ సమాధానం ఇస్తూ రైతులు పండించిన పంటలకు తగిన ధరలను కల్పించడంతో పాటు రైతులకు పంటల బీమా వంటివి కల్పించి వారి ఆదాయాన్ని పెంపొందించే చర్యలు తీసుకోగలిగితే రైతు ఆత్మహత్యలను నివారించవచ్చని, ఆ దిశగా ప్ర‌భుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రభుత్వ సలహాదారు టి.విజయ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో 201-17 ఏడాదిలో 40వేల 656 మంది రైతులను జీరో బేస్డ్ ప్రకృతి వ్యవసాయం కింద సాగు చేపట్టేందుకు 704 కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ప్రకృతి వ్యవసాయం చేపట్టిన రెండవ ఏడాదిగా ఈ ఏడాది 334 మండలాల్లోని 974 గ్రామాల్లో 401 క్లస్టర్లలో లక్షా 63వేల 100 మంది రైతులను ప్రకృతి వ్యవసాయం కిందుకు తీసుకురావడం జరిగిందని వివరించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ హరిజవహర్‌లాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *