21 రోజుల్లోనే అనుమతులు..ప్రాసెసింగ్ పరిశ్రమకు ఏపి అనుకూలం!

 

ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలకు పరిశ్రమ ఏర్పాటుకు కావాల్సిన అన్ని అనుమతులను 21 రోజుల్లోనే మంజూరు చేస్తామని జర్మనీలోని పలు కంపెనీల ప్రతినిధులకు పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ రెడ్డి హామీ ఇచ్చారు. నవ్యాంధ్రకు పెట్టాబడుల ఆకర్షణే లక్ష్యంగా విదేశీ పర్యటన కొనసాగిస్తున్న మంత్రి అమరనాథ రెడ్డి బుధవారం హంబర్గ్ (జర్మనీ)లో జర్మన్ ఆసియా-పసిఫిక్  బిజినెస్ అసోసియేషన్, హంబర్గ్ ఫారిన్ ట్రేడ్ ప్రమోషన్ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా మంత్రి.. అగ్రిబిజినెస్, ఫుడ్ ప్రాసెసింగ్, డిఫెన్స్, షిప్ బిల్డింగ్ పరిశ్రమల స్థాపనకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అవకాశాలు, మౌళిక వసతులు గురించి వివరించారు. రొయ్యలు, మిరప, మామిడి, టమోటా, ఫిష్, మాంసం(మీట్) తదితర ఉత్పత్తులు ఆంధ్రపరదేశ్ లో పుష్కలంగా దొరకుతాయని, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ఏపీ అనుకులంగా ఉంటుందని తెలిపారు. వ్యవసాయ రంగంలో ఏపీ 12 శాతం వృద్ధి సాధించిందన్నారు. ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు. దేశంలో ఏ రాష్టం లేని పాలసీలను అమలు చేస్తుండడంతో కియా లాంటి ప్రపంచ స్థాయి కంపెనీ ఏపీలో పెట్టుబడులు పెట్టిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో రెండు అత్యున్నత పారిశ్రామిక నడవలు Industrial Corridors లను 50 వేల ఎకరాల విస్థీర్ణంలో ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఇప్పటికే ఏపీలో పారిశ్రామికాభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతోందని ఏపీలో కంపెనీలు ఏర్పాటు చేసే వారికి పలు రాయితీలు ఇస్తామన్నారు. కాగా ఈ నెల 24 నుంచి విశాఖ లో ప్రారంభమయ్యే భాగస్వామ్య సదస్సులో పాల్గొంటామని పలు కంపెనీల ప్రతినిధులు మంత్రికి హమీ ఇచ్చారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఆర్ ప్రీతమ్ రెడ్డి, ఈడిబి అధికారులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *