తర్వాత లక్ష్యం పులివెందులే…సీఎం చంద్రబాబు

30
వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఏకపక్షంగానే జరుగుతాయని, తమ పార్టీ 2019 లక్ష్యం పులివెందులే అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత  ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన చిట్ చాట్ చేశారు. ఎన్నికల ఫలితాలపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అందరూ తమ పదవులకు రాజీనామా చేసి పోటీ చేస్తే ఏం జరుగుతుందో చూద్దామని చంద్రబాబు అన్నారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు ఫిరాయింపుల చట్టం వర్తించదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలను నమోదు చేసుకుంటామని చంద్రబాబు దీమా వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here