1,56,999 కోట్ల తో బడ్జెట్ ను ప్రవేశపెట్టడం సీఎంగారి ఘనత!

14

IMG-20170316-WA0031మంత్రి శ్రీమతి పీతల సుజాత గారు వెలగపూడి సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ (2017-2018) ప్రజామోద బడ్జెట్. రాష్ట్రం ఆర్ధికంగా అప్పులలో ఉన్నప్పటికి అందరూ సంతోషంగా ఉండలని ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు. రాష్ట్రం ప్రస్తుతం 16,000 వేల కోట్ల లోటు బడ్జెట్ లో ఉంది. రైతుల మద్దత్తుతో రాజధానిని నిర్మింస్తూ ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్నారు. 1,56,999 కోట్ల తో బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ముఖ్యమంత్రిగారి ఘనత. గత సంవత్సరం కంటే మహిళా, శిశు సంక్షేమ శాఖకి (1773 కోట్లు), వికలాంగుల శాఖకి (89.51 కోట్లు) ఎక్కువ నిధులు కేటాయించినందుకు ముఖ్యమంతి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుటున్నాను. విభిన్నప్రతిభావంతుల మ్యారెజీకి సంబంధించి గతంలో 50,000 రూ. ఇచ్చేవారు ప్రస్తుతం 1,00000 (లక్షా రూపాయాలు చేశారు) విభిన్నప్రతిభావంతులకు సంబంధించి ఉద్యోగల భర్తిని మార్చి నెలఖరు పూర్తి చేస్తామన్నారు.
రోజా ఫ్రివిలేజ్ కమిటి అంటే బయపడిపోతుంది. పబ్లిసీటీ కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. ఇంత మంచి పనులు చేస్తున్న ప్రభుత్వాన్నిఅభినందించకుండా ఇష్టం వచ్చినట్లు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తే వాళ్ళ పార్టీకి పుట్టగతులుండవని బయపడుతున్నారు. రాష్ట్రం అభివృద్ధి చేందకుడదాని ప్రతిపక్షం వ్యవహరిస్తుంది. ప్రాజెక్టులు, రాజధాని విషయంలో ఇలా ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో అడ్డుపడుతున్నారు.
7 మండలలను ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించి మన రాష్ట్రంలో కలపడం వల్ల పోలవరం సాధ్యపడుతుంది. ముఖ్యమంత్రి గారి కృషి వల్ల ప్రత్యేక ప్యాకేజికి చట్టబద్దత కల్పించారు. కేంద్రం ఇచ్చే ప్రతి పైసా తీసుకొని రాష్ట్రన్ని అభివృద్ధి చేసుకోవాలి. మరణించిన వారికి కూడ సంతాపం చేప్పడానికి ఇష్టపడని ప్రతిపక్షం ఉంది. ఇటువంటి ప్రతిపక్షం ఉండడం దురదృష్టకారం. రాష్ట్రన్ని అన్ని రంగాలలో నెం 1 చేయాలని ముఖ్యమంత్రిగారు పట్టుదలగా పనిచేస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందితే పార్టీ మనుగడ ఉండదని జగన్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. డా.బి.ఆర్ అంబేద్కర్ స్మృతి వనం కు 97 కోట్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రిగారికి కృతజ్ఞతలు తెలియాజేస్తున్నాను. రాష్ట్రాభివృద్ధికి ఈ బడ్జెట్ పూర్తి స్ధాయిలో దోహదపడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here