జూన్ లో వస్తున్న ‘127బి…మిషన్ ఇంపాజిబుల్’

127B-Mission Impossible-apvarthalu-com
ప్లే బ్యాక్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై హరీష్ చంద్ర చాండక్ నిర్మాతగా… డా. శేషు కెఎంఆర్ దర్శకుడిగా తెరకెక్కిస్తున్న చిత్రం 127 బి – మిషన్ ఇంపాజిబుల్. హైదరాబాదీ డెక్కన్ చిత్రాల్లో తొలి హార్రర్ సస్పెన్స్ సినిమాగా ఇది తెరకెక్కుతోంది. రాంగోపాల్ వర్మ దగ్గర దాదాపు 10 చిత్రాలకు పని చేసి… తొలి సారిగా మెగా ఫోన్ పట్టారు శేషు. ఫ్లో సౌండ్ స్పెషలిస్ట్ గా వరల్డ్ రికార్డ్ హోల్డర్ గా పేరు సంపాదించిన శేషుకు భారతీయ చిత్ర పరిశ్రమలో చాలా మంచి పేరుంది. పలు సూపర్ హిట్ చిత్రాలకు ఆయన అందించిన సౌండ్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేకంగా నిలిచింది. ఇప్పుడిదే ఫ్లో సౌండ్ టెక్నాలజీతో 127బి చిత్రం రూపొందిస్తున్నారు. ది అంగ్రేజ్ చిత్రంతో దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ధీర్ చరణ్ శ్రీవాస్తవ్ (ఇస్మాయిల్ భాయ్), మస్త్ అలీ, అజీజ్ నాజర్ ఇందులో ముఖ్య కథానాయకులు. హీనా షేక్ హీరోయిన్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ నెలలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్ర విశేషాల గురించి నిర్మాత హరీష్ చంద్ర చాండక్ మాట్లాడుతూ… ఆర్ధిక సంబంధాలు ఎక్కువగా ప్రభావితం చేసే ఈ సమాజంలో జీవిస్తున్న ముగ్గురు యువకుల కథ ఇది. రాత్రికి రాత్రే ధనవంతులు కావాలనే ఆత్యాశతో సుమారు “500 సంవత్సరాల” నాటి నిధిని ధక్కించుకోవడానికి ఒక వ్యూహం ఎంచుకుంటారు. దాని వల్ల… వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది! వాటి నుండి వాళ్ళు బయటపడ్డారా.. లేదా ?, వాళ్ళకు ఎదురైన విచిత్రమైన పరిస్థితులేంటి… ఆ నిధి వెనక ఉన్న రహస్యాలేంటి… నిధిని దక్కించుకున్నారా, లేదా? అనే ఆసక్తికర కధాంశంతో తెరకెక్కుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ మరియు హార్రర్ కామెడీ సినిమా 127 B (Mission Impossible). ది అంగ్రేజ్ ఫేం ధీర్ చరణ్ శ్రీవాస్తవ్ (ఇస్మాయిల్ భాయ్), మస్త్ అలీ, అజీజ్ నాజర్ ఇప్పటివరకు నటించిన చిత్రాలు ఒక ఎత్తయితే… 127బి మరో ఎత్తు. ఎందుకంటే… డెక్కన్ వుడ్ లో తొలిసారిగా హార్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాన్ని ఫ్లో సౌండ్ టెక్నాలజీతో తెరకెక్కిస్తున్నాం. హీనా షేక్ అందచందాలు, పెర్ ఫార్మెన్స్ ఈ సినిమాకు మరో హైలైట్ గా నిలుస్తాయి అన్నారు.
దర్శకుడు డా.శేషు మాట్లాడుతూ… హైదరాబాదీ డెక్కనీ చిత్రాలు ఇప్పటివరకు ఓ తరహా కథలతోనే ఎంటర్ టైన్ చేసింది. కానీ మా 127 బి చిత్రంతో డెక్కనీ పిల్మ్ స్థాయిని మరింత పెంచుతున్నాం. ది అంగ్రేజ్ చిత్రంతో దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ధీర్ చరణ్ శ్రీవాస్తవ్ (ఇస్మాయిల్ భాయ్), మస్త్ అలీ, అజీజ్ నాజర్ ను ఇందులో కొత్త క్యారెక్టర్లలో చూపించబోతున్నాం. తొలిసారిగా హార్రర్, సస్పెన్స్థ్ థ్రిల్లర్ అంశాలతో ఈ సినిమా రూపొందుతోంది. హీనా షేక్ పెర్ ఫార్మెన్స్ మెస్మరైజ్ చేస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్ర ఆడియోను రిలీజ్ చేసి జూన్ నెలలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. అని అన్నారు.
ఆర్టిస్టులు – ధీర్ చరణ్ శ్రీవాస్తవ్ (ఇస్మాయిల్ భాయ్), మస్త్ అలీ, అజీజ్ నాజర్, హీనా షేక్
బ్యానర్ – ప్లే బ్యాక్ ఎంటర్ టైన్ మెంట్
సినిమాటోగ్రఫీ – కుందన్ సాద్
ఎడిటర్ – మహేంద్ర నాథ్
డైలాగ్స్ – హుస్సేన్ రజా
నిర్మాత – హరీష్ చంద్ర చాండక్
స్టోరీ, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం – డా.శేషు కెఎంఆర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *