‘హైపర్‌’ మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది- రామ్‌

35

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో వెంకట్‌ బోయినపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘హైపర్‌’ (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). జిబ్రాన్‌ సంగీతం అందించిన ఈ సినిమా థియేట్రికల్‌, పాటల విడుదల కార్యక్రమం సెప్టెంబర్‌ 23న హైదరాబాద్‌ జె.ఆర్‌.సి.కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగింది.
కార్యకమ్రంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సుకుమార్‌, హరీష్‌ శంకర్‌, నాని హైపర్‌ థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా…. ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ మాట్లాడుతూ – ”సంతోష్‌ ‘కందిరీగ’ కథ నాకు చెప్పినప్పుడు తను పెద్ద డైరెక్టర్‌ అవుతాడనిపించింది. ‘హైపర్‌’ కథ చెప్పేటప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది. మా కాంబినేషన్‌లో సూపర్‌హిట్‌ అవుతుంది. సంతోష్‌ నాకెంటే హైపర్‌. సినిమా స్టార్ట్‌ చేసిన మూడు నెలలకే పూర్తి చేసేశాడు. నిర్మాతలు చాలా ప్యాషనేట్‌. వారి ప్యాషన్‌ ప్రతి సినిమాకు పెరుగుతుంది. నాకొక మరో హోం బ్యానర్‌ దొరికినట్లు అనిపిస్తుంది. జిబ్రాన్‌ చాలా మంచి ఆల్బమ్‌ ఇచ్చాడు. సమీర్‌రెడ్డి ప్రతి సీన్‌ను ఎంతో అద్భుతంగా చూపించారు. చాలా కమిట్‌మెంట్‌ ఉన్న వ్యక్తి. అలాగే అబ్బూరిరవిగారు ఎంతో సహకారం అందించారు. సెప్టెంబర్‌ 30న హైపర్‌ విడుదలవుతుంది” అన్నారు.
సుకుమార్‌ మాట్లాడుతూ – ”ట్రైలర్‌ సూపర్బ్‌గా ఉంది. ట్రైలర్‌ చూస్తుంటే పాజిటివ్‌ వైబ్స్‌ వస్తుంది. రామ్‌తో జగడం మూవీ చేశాను. అప్పటి నుండి ఇప్పటి వరకు తను అలాగే ఉన్నాడు. ఈ సినిమా రామ్‌కు పెద్ద హిట్‌ అవుతుంది. అలాగే 14 రీల్స్‌ నిర్మాతలు చాలా కూల్‌గా ఉంటారు. సంతోష్‌ శ్రీన్ వాస్‌కు ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుంది” అన్నారు. హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ – ”14రీల్స్‌ బ్యానర్‌లో హైపర్‌ బిగ్గెస్ట్‌ హిట్‌ కావాలి. అందరూ డబ్బులు సంపాదించాలనే కోరికతో ఇండస్ట్రీకి వస్తారు కానీ 14 రీల్స్‌ గోపీ, రామ్‌, అనీల్‌గారు డబ్బు సంపాదించి సినిమాపై ప్యాషన్‌తో ఈ ఇండస్ట్రీలోకి వచ్చారు. ఈ బ్యానర్‌లో దూకుడు సినిమా వచ్చి ఐదేళ్లు అవుతుంది. అలాంటి హిట్‌ ఈ సినిమాతో నిర్మాతలు అందుకోవాలి. రామ్‌ కెరీర్‌లోనే ఈ ట్రైలర్‌ చాలా బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుంది. కందిరీగ వాసు ఎనర్జీ, స్పీడ్‌ అంటే ఇష్టం. పాటలు బావున్నాయి. సంతోష్‌కు ఈ సినిమా కమ్‌బ్యాక్‌ మూవీ అవుతుంది. ఈ కథను నాకు ముందుగా వినిపించాడు. కథ వినగానే నాకు నచ్చింది. సినిమా డెఫనెట్‌గా వాసు కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుంది” అన్నారు.
హీరో నాని మాట్లాడుతూ – ”14 రీల్స్‌ బ్యానర్‌లో నేను కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమా చేశాను. ఈ సినిమా సమయంలో వారితో మంచి అనుబంధం ఏర్పడింది. యూనిట్‌లో అందరినీ కూల్‌గా ఉండేలా చూస్తారు. ఇక హైపర్‌ సినిమా విషయానికి వస్తే అన్నీ పాటలు బావున్నాయి. జిబ్రాన్‌గారు సంగీతం అంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో బేబిడాల్‌ సాంగ్‌ నాకు బాగా నచ్చింది. థియేట్రికల్‌ ట్రైలర్‌ చాలా బావుంది. రామ్‌కు సరిపోయే టైటిల్‌గా హైపర్‌ అని పెట్టారు. వాసుతో ఎప్పటి నుండో పరిచయం ఉంది. వాసు ఎంత ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాడో హైపర్‌ సినిమా ఎంత ఎంటర్‌టైనింగ్‌గా ఉండబోతుందో నాకు తెలుసు. సినిమా పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటూ యూనిట్‌కు అభినందనలు” అన్నారు. దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ – ”14 రీల్స్‌ అంటే ఇష్టమే కాదు, గౌరవం కూడా. రామ్‌తో ఎలాంటి కథతో సినిమా చేయాలో చర్చించి నిర్ణయం తీసుకోవడానికి మాకు మూడు నెలలు పట్టింది. కమర్షియల్‌ సినిమాల స్టయిల్‌లో కాకుండా ఏదో చెప్పాలి, దాంట్లో ఓ నిజాయితీ ఉండాలని రాసుకున్న కథే హైపర్‌. ప్రతి ఒకరికి వారి తండ్రే హీరో. ఈ సినిమాలో హీరోకు కూడా తండ్రే హీరో. తండ్రిని గెలిపించే కథే హైపర్‌. కథ రాసుకోగానే రామ్‌కు పర్‌ఫెక్ట్‌గా సరిపోయే కథ అని ఆయనకు చెప్పడం, ఆయనకు నచ్చడంతో అసలు యుద్ధం అక్కడ నుండే ప్రారంభమైంది. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా సక్సెస్‌ తర్వాత నేను సినిమా గురించి మాట్లాడుతాను. గౌతంరాజు, సమీర్‌రెడ్డి, అబ్బూరి రవి, జిబ్రాన్‌ సహా అందరూ ఎంతగానో సపోర్ట్‌ చేశారు. సత్యరాజ్‌గారు, మురళీశర్మ, రావు రమేష్‌ సహా అందరూ సపోర్ట్‌ చేశారు. నా కెరీర్‌లో, నేను చేసిన మూడు సినిమాల్లో ఇదే బెస్ట్‌ మూవీ అవుతుంది” అన్నారు.
జిబ్రాన్‌ మాట్లాడుతూ – ”ఈ ఆల్బమ్‌ నాకెంతో స్పెషల్‌. దర్శక నిర్మాతలు ఎంతగానో సపోర్ట్‌ చేశారు. పాటలకు చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌” అన్నారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు స్రవంతి రవికిషోర్‌, కె.ఎల్‌.దామోదర్‌ ప్రసాద్‌, దర్శకులు రాఘవపూడి, కిషోర్‌ తిరుమల, మురళీ శర్మ, ప్రభాస్‌ శ్రీను తదితరులు పాల్గొని యూనిట్‌ను అభినందించారు. ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌, రావు రమేష్‌, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, తులసి, హేమ, ప్రియ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్‌, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, ఆర్ట్‌: అవినాష్‌ కొల్లా, ఎడిటింగ్‌: గౌతంరాజు, మాటలు: అబ్బూరి రవి, లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, సమర్పణ: వెంకట్‌ బోయినపల్లి, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్‌ శ్రీన్‌వాస్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here