హైకోర్టు ఏర్పాటుకు ఆకృతులు, భ‌వ‌నాల‌ను ప‌రిశీలించిన న్యాయ‌మూర్తులు

ఆంధ్రప్రదేశ్ రాజధానిలోని తాత్కాలిక భవనంలో హైకోర్టును ఏర్పాటు చేసేందుకు అనువైన భవ‌నాల‌ను పరిశీల‌న నిమిత్తం స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జ్యూడియేషర్ ఎట్ హైదరాబాద్ బృందం మూడు రోజుల పాటు నగరంలో పర్యటించేందుకు హైదరాబాదు నుండి శుక్ర‌వారం గన్నవరం విమానాశ్ర‌యానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా హైకోర్టు న్యాయమూర్తులకు జిల్లా జడ్జిలు జస్టీస్ వై.లక్ష్మణరావు, జస్టీస్ ఎ.వి.రవీంద్రబాబు, విజయవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సోము కృష్ణమూర్తి, జనరల్ సెక్రటరీ కందుల శ్రీనివాసరావు, న్యాయమూర్తులు నరహరిశెట్టి శ్రీహరి, ఆర్డివో సి.హెచ్.రంగయ్య, తాహశీల్దార్ ఎం.మాధూరి, పలువురు న్యాయమూర్తులు, అధికారులు ఘ‌న‌స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తుల బృందం గన్నవరంలోని వెటర్నరీ యూనివర్శిటి భవనాన్ని పరిశీలించారు. పరిశీలనకు విచ్చేసిన బృందంలో జస్టీస్ వి.రామసుబ్రహ్మణ్యం, జస్టీస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఎ.వి.శేషసాయి, జస్టిస్ టి.సునీల్‌చౌదరి, జస్టీస్ పి.సత్యనారాయణమూర్తి ఉన్నారు. ఈ సంద‌ర్భంగా వారికి యూనివర్శిటి డీన్ డాక్ట‌ర్ జి.శ్రీనివాసరావు, ఆర్.అండ్.బి చీఫ్ ఇంజనీర్ పి.శ్రీమన్నారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎ.ఎల్.మాధవస్వరూప్, డిఈ కిషోర్ బాబ్జీ త‌దిత‌రులు పాల్గొని యూనివర్శిటి భవానాలకు సంబంధించిన ఆకృతులను, ప్రాంగణాన్ని చూపించారు. అనంతరం న్యాయ‌మూర్తుల బృందం న‌గ‌రంలో బ‌స చేశారు. శనివారం మరికొన్ని భవనాలను పరిశీలించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *