హైకోర్టు ఉద్యోగులకు ఉచిత వసతి, రవాణా సౌకర్యం!

180

అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని, హైకోర్టు ఉద్యోగులకు ఉచిత వసతి, రవాణా సౌకర్యం కల్పిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. అభివృద్ధికి ప్రజలంతా సహకరిస్తున్నారని తెలిపారు. అమరావతి నిర్మాణంలో హైకోర్టు భవన నిర్మాణం ప్రధాన ఘట్టమన్నారు. రాష్ట్ర విభజన నాటి నుంచి ఏపీకి ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయని, విభజన చట్టంలో హోదా ఇస్తామని చెప్పారు.. కానీ ఇవ్వలేదని సీఎం దుయ్యబట్టారు. రాజధానికి భూములిచ్చి సహకరించిన రైతులకు ఈ సందర్భంగా చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 34 వేల ఎకరాల భూమి త్యాగం చేశారని కొనియాడారు. రైతుల త్యాగాలు వృథా కాకుండా అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తున్నామని, అమరావతిని టాప్‌-5 నగరాలలో ఒకటిగా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. అమరావతిలో నిర్మించే 9 నగరాలలో న్యాయనగరం కూడా ఒకటని, న్యాయనగరంలో న్యాయాధికారులు, సిబ్బందికి అవసరమైన వసతులు కల్పిస్తామని సీఎం తెలిపారు. కోర్టుల్లో 1.70 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, కేసులు వేగవంతంగా పూర్తి చేసేందుకు.. అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అమలు చేస్తామన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో అవినీతిని నిర్మూలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అమరావతిలో నల్సార్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకరించాలని చంద్రబాబు కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here