హాట్ యాంకర్ గ్లామర్ వర్కవుట్ అవుతుందా?

82

Anasuya

నో డౌట్… హాట్ యాంకర్ అనసూయకు మంచి ఫాలోయింగే వుంది. అంత మంది యాంకర్లు వుండగా అనసూయ యాంకరే వేరయా అన్నట్టు… ఈ యాంకర్ కు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం వచ్చినా నటించలేదనే ప్రచారం వుంది. అయితే అప్పట్లో ఈ అమ్మడు గర్భవతి కావడంతో అందులో నటించలేదనే ప్రచారం జరిగింది. అయితే ఓ బిడ్డకు తల్లి అయిన తరువాత ఈ అమ్మడు అంటు యాంకర్ గానూ… ఇటూ యాక్టర్ గానూ వేగం పెంచింది. అప్పుడప్పుడు చిన్న చిన్న వేషాలు వేస్తూనే… నాగార్జునతో ‘సోగ్గాడే చిన్నినాయనా’లాంటి సినిమాలో స్టెప్పులు కూడా వేసింది. క్షణం సినిమాలో ఓ వైవిధ్యమైన రోల్ పోషించి మెప్పించింది.

ఇవన్నీ ఓ ఎత్తైతే… ఓ సినీ కవి అన్నట్టు.. ఇరవైలో చెయ్యని అల్లర్లు.. అరవైలో చేస్తే ఏం లాభం? అన్నచందంగా వుంది… ఇప్పుడు అనసూయ గ్లామర్ ఫొటోషూట్ ఫొటోలు చూస్తుంటే. ఎందుకంటే… ఈ ఫొటో షూట్ ఆమె ఏజ్ కి… ఇప్పుడున్న స్థితికి తగ్గట్టుగా ఉంటే.. ఎవరూ విమర్శించరు. కానీ. అందులోనూ ఓ చంటిపిల్లకు తల్లైన తరువాత.. చాలా డీసెంట్ గా వుండాల్సిన ఆమె ఫోజులు… కుర్రాకారును మెప్పించాలనే తాపాత్రయంతో… ఒంపుసొంపులు చూపిస్తూ.. షూట్ కి రెడీ కావడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికిప్పుడు అయితే.. ఆమెకు ఓ స్టార్ హీరోనూ తన పక్కన హీరోయిన్ గా బుక్ చేసుకునేంత సీన్ అయితే లేదు. వేస్తే గీస్తే.. లేడీ ఓరియంటెడ్ లేదా వాంప్ క్యారెక్టర్లు ఆఫర్ చేస్తారు. అందుకోసం అంత హాట్ గా కనిపించాలనే తాపత్రయం ఆమెలో కనిపిస్తున్నట్టుంది.

మరోపక్క.. రేష్మి గౌతమ్ అనే ఓ యంగ్ యాంకరమ్మ అనసూయకు విపరీతంగా పోటీ ఇస్తోంది. ఇప్పటికే జబర్దస్థ్ లాంటి ప్రోగ్రాంతో బాగా పాపులర్ అయింది. గతంలో అనసూయ కూడా ఇదే ప్రోగ్రాంతోనే పాపులర్ అయిందిలే. రేష్మి గౌతమ్.. కేవలం ఇదొక్క ఎపిసోడ్ తోనే సరిపెట్టుకోకుండా… గుంటూరు టాకీస్ లాంటి సినిమాలో నటించి బాగా పాపులర్ అయింది. దాంతో ఇప్పుడు అనసూయ కూడా.. రేష్మిగౌతమ్ నుంచి గట్టి పోటీనే ఎదుర్కొంటోంది. దాంతో ఇప్పుడు అనసూయ ఇలాంటి హాట్ ఫొటో షూట్ లతో కుర్రకారును.. నిర్మాతలను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. ఏది ఏమైనా.. రేష్మి గౌతమ్ లాంటి వాళ్లతో పోటీ కాకుండా.. తనకు సూటైన వారితో పోటీ పడి అవకాశాలు దొరకబుచ్చుకుంటే.. అనసూయ పది కాలల పాటు.. ఇండస్ట్రీలో నిలదొక్కగలదని సగటు ప్రేక్షకుడి ఆలోచన

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here