హస్కీ వాయితో ‘జనతా హోటల్’ ఐదో టీజర్!

96

దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా రూపొందిన ‘జనతా హోటల్’ ఐదో టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌కు ఓ ప్రత్యేకత ఉంది. నిర్మాత సురేష్ కొండేటి ఈ టీజర్‌ను సినిమాతో సంబంధం లేని వ్యక్తి వాయిస్‌తో చేయించారు. రేడియో మిర్చిలో పనిచేసే ప్రముఖ ఆర్జే స్వాతి వాయిస్‌తో ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. ఆమె హస్కీ వాయిస్ టీజర్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంది. ‘మహానటి’ సినిమాలో ‘అమ్మాడీ..’ అంటూ అమ్మాయిలను మంత్రముగ్ధులను చేసిన దుల్కర్ సల్మాన్ గురించి ఈ టీజర్‌లో ఉంది. మళయాలంలో ఘనవిజయం సాధించి ఇంటర్‌నేషనల్ ఫిల్మ్‌ఫెస్ట్‌కు సెలెక్ట్ అయిన ‘ఉస్తాద్ హోటల్’ను తెలుగులో ‘జనతా హోటల్’ పేరుతో ప్రముఖ నిర్మాత సురేష్ కొండేటి విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ సంగీతం అందించిన ఈ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here