స్పీకర్ పదవికి దాఖలైన ఒకే ఒక నామినేషన్!

77

ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక పూర్తయింది. వైసీపీ నేత తమ్మినేని సీతారం స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి ఈరోజు ఆయన నామినేషన్ వేశారు. ఆయనను బలపరుస్తూ 30 మంది సభ్యులు మద్దతు తెలపారు..

నామినేషన్ల గడువు ముగిసే సమయానికి కేవలం ఒక నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో..తమ్మినేని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రేపు ఉదయం 11 గంటలకు స్పీకర్ గా ఆయన పదవీబాధ్యతలను చేపడతారు.

ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన తమ్మినేని స్పీకర్ గా ఉండాలని సీఎం జగన్ నిర్ణయించారని చెప్పారు. శాసనసభ విలువలను కాపాడేలా ఆయన వ్యవహరిస్తారని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here