స్ట్రాంగు రూంల వద్ద మూడంచెల పటిష్ట భద్రత -అనంత రేంజ్ డి.ఐ.జి

147

అనంతపురం జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్ తో కలసి జెఎన్టీయూ స్ట్రాంగు రూంల భద్రతను పరిశీలించి సమీక్షించిన డి.ఐ.జి
ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు( ఈ.వి.యం) భద్రపరిచిన స్ట్రాంగు రూంలకు మూడంచెల పటిష్ట భద్రతతో పహారా ఏర్పాటు చేశామని అనంతపురం రేంజ్ డి.ఐ.జి కాంతి రాణ టాటా పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్ తో కలసి ఆయన బుధవారం స్థానిక జెఎన్టీయులోని స్ట్రాంగు రూంలను పరిశీలించారు. అక్కడ భద్రతను సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఉన్న రెండు పార్లమెంటు నియోజకవర్గాలు… 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవిఎం లను జెఎన్టీయు మరియు ఎస్కేయూనివర్శిటీ స్ట్రాంగు రూంలలో భద్రపరిచామన్నారు. ఈ స్ట్రాంగు రూంల వద్ద మూడంచెల పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు. తొలిఅంచెలో సి.ఆర్ .పి.ఎఫ్ … రెండవ అంచెలో ఎపీఎస్పీ బలగాలు… మూడవ అంచెలో 150 మంది జిల్లా పోలీసు బలగాలుతో భద్రత చేపట్టామన్నారు. స్ట్రాంగు రూంలకు వెళ్లే ఎంట్రెన్స్ , కారిడర్ మరియు స్ట్రాంగు రూంలో సి.సి కెమేరాలు ఏర్పాటు చేశామన్నారు. కరెంటు సౌకర్యం కల్పించామన్నారు. ఇతర ప్రభుత్వ విభాగాలైన అటవీ మరియు విద్యుత్ శాఖల సహకారం కూడా తీసుకున్నామన్నారు. ఇద్దరు డీఎస్పీలు క్యాంపు కమాండర్లుగా నేతృత్వం వహించి పటిష్ట భద్రత కల్పిస్తారన్నారు. తాను, జిల్లా కలెక్టర్ , జిల్లా ఎస్పీలు స్ట్రాంగు రూంలను క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. ఓట్ల లెక్కింపు ముగిసే వారకు అనుమతి ఉన్నవారు మాత్రమే స్ట్రాంగు రూంల పరిసరాల్లోకి వెళ్లాల్సి ఉందాన్నారు. అనంతపురం రేంజ్ డి.ఐ.జి., ఎస్పీలతో పాటు డీఎస్పీలు పి.ఎన్ .బాబు, ఆంథోనప్ప, మహబూబ్ బాషా, ఇన్స్పెక్టర్లు యుగంధర్ , చంద్రశేఖర్ మరియు సీఆర్పీఎఫ్ అధికారులు వెంట వెళ్లారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here