సెప్టెంబర్‌ 30న 14 రీల్స్‌ ‘హైపర్‌’

hyper De

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘హైపర్‌’ (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ వైజాగ్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 30న విజయదశమి కానుకగా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర మాట్లాడుతూ – రామ్‌, సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ‘హైపర్‌’ రూపొందుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ వైజాగ్‌లో శరవేగంగా జరుగుతోంది. వైజాగ్‌ షెడ్యూల్‌తో టోటల్‌ టాకీపార్ట్‌ కంప్లీట్‌ అవుతుంది. సెప్టెంబర్‌ 9కి పాటల చిత్రీకరణ కూడా పూర్తవుతుంది. సెప్టెంబర్‌ రెండోవారంలో ఆడియో రిలీజ్‌ చేసి సెప్టెంబర్‌ 30న విజయదశమి కానుకగా వరల్డ్‌ వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నాం” అన్నారు.
ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌, రావు రమేష్‌, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, తులసి, హేమ, ప్రియ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్‌, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, ఆర్ట్‌: అవినాష్‌ కొల్లా, ఎడిటింగ్‌: గౌతంరాజు, మాటలు: అబ్బూరి రవి, లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, సమర్పణ: వెంకట్‌ బోయనపల్లి, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్‌ శ్రీన్‌వాస్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *