సీబీఐ చార్జిషీట్ లో భారతి గారి పేరు లేదు;వైసీపీ

437

రాష్ర్టంలో తిరుగులేని ప్రజాదరణతో ప్రజలకు చేరువైన శ్రీ వైఎస్ జగన్ కుటుంబప్రతిష్టను దెబ్బతీయడానికి చంద్రబాబు కేంద్ర ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ తో కలసి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట అధికారప్రతినిధి శ్రీ తమ్మినేని సీతారామ్ ధ్వజమెత్తారు.దీనిలో బాగమే శ్రీ భారతిగారిపై కేసులు అంటూ ఏడేళ్ల తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేయడమని ఆరోపించారు. విజయవాడలోని వైఎస్సార్ కాంగ్రస్ పార్టీ రాష్ర్ట కార్యాలయంలో పార్టీ రాష్ర్ట అధికారప్రతినిధి శ్రీ తమ్మినేని సీతారామ్ శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు….ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన మాటలు……
ఈడి కేసులో నిందితురాలిగా వైఎస్ భారతి అంటూ రెండు దినపత్రికలు వార్తలు ప్రచురించాయి.అసలు ఈ విషయం శ్రీమతి భారతిగారికి కాకుండా మన రాష్ర్టంలోని ఎల్లోమీడియాకు ముందుగా ఎలా తెలిసింది. ఎలా బయటకు వచ్చింది.మీడియా సంస్దలకు అదికూడా సెలెక్టెడ్ మీడియా సంస్ధలకు మాత్రమే సమాచారం ఎక్కడినుంచి వచ్చింది.ఇలాంటిది ఏమైనా ఉంటే ముందు ఈ డి నుంచి నేరుగా శ్రీమతి బారతికి సమాచారం రావాలి.అలా కాకుండా ఎల్లోమీడియాకు నేరుగా రావడం అంటే తెలుగుదేశం పార్టీ ఈ డి అదికారులను తమ చెప్పుచేతులలో పెట్టుకుని వారి ద్వారా కావాల్సిన పనుల్ని కావాల్సిన విధంగా చేయించుకుంటున్నట్లు స్పష్టమవుతుంది.గతంలో సిబిఐని ఇదే విధంగా ఉపయోగించుకుంటే ఈసారి ఈడిని ఉపయోగించుకుంటున్నారని స్పష్టంగా అర్దమవుతుంది.చంద్రబాబు ఈ కుట్రలు మానవా అని తమ్మినేని ప్రశ్నించారు.
చంద్రబాబు కుట్ర ఏ స్టాయికి చేరిందో ఈ నేపద్యంలో ఎవరికైనా అర్దమవుతుంది.అంటే ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ లో ఉన్న అధికారులతో తెలుగుదేశం పార్టీ ,ఎల్లో మీడియా పడుగూ పేకల్లా కలిసిపోయి ,ఎల్లో ఏజంట్లే నేరుగా దర్యాప్తు సంస్ధల్లో టిడిపి రాజకీయ ఏజంట్లుగా పనిచేస్తున్నట్లుగా మనకు అర్దమవుతుంది.ఈ విషయంపై ఇంతకుముందే మానాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2017 ఫిబ్రవరిలో భారతప్రధానికి ఉత్తరాలు రాయడం జరిగింది.వారు ….ఎస్ ఏ ఉమాశంకర్ గౌడ్ జాయింట్ డైరక్ట్రర్,బి ఎస్ గాందీ ,ఉమాశంకర్ గౌడ్ టిడిపి రాజ్యసభసభ్యుడు దేవేందర్ గౌడ్ మేనల్లుడు.గాంధి అనే అధికారి కుడా టిడిపికి అనుకూలుడు.
వీరిపై యాక్షన్ తీసుకోండి….తెలుగుదేశం ప్రభుత్వంకు లోబడి వీరు పనిచేస్తున్నారని లేఖ ఇవ్వడం జరిగింది.దీనిపై ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు.ఇది దురదృష్టకరమైన అంశం.హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడం అక్కడ క

డుతున్నారు.గతంలోనే భారతి గారిపై కేసు పెడదామని చూసినా సిబిఐకి ఎలాంటి ఆధారాలు లేక ఛార్జ్ షీట్ లో పేర్కొనే అవకాశం లేకుండా పోయింది.ఏదిఏమైనా చివరకు న్యాయం గెలుస్తుంది నీతి నిలబడుతుంది.అని స్పష్టం చేసారు.చంద్రబాబు కుట్రలు ప్రజలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని తమ్మినేని పేర్కొన్నారు.ూడా న్యాయం లభించలేదు.అంతలో అదికారి గాంధీ అనే అదికారికి మూడు పర్యాయాలు పదవిని పొడిగించడం జరిగింది.అంటే పదవి పొడిగించడం కూడా కేసును బిజేపి,టిడిపి అభీష్టానికి అనుగుణంగా వాడుకుంటోంది అనేందుకు ఇదే బలమైన నిదర్సనం అని స్పష్టంగా చెప్పవచ్చు.
సిబిఐ చార్ఝ్ షీట్ లో శ్రీమతి భారతి గారిని ఎక్కడా కూడా దోషిగా ఆరోపిీంచే ప్రయత్నం చేయలేదు.ఇప్పుడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టర్ ఆమెను నిందితురాలు అంటూ ఏడేళ్ల తర్వాత ఆరోపణలు చేస్తోంది.ఎలాంటి అవినీతి జరగకపోయినా జరిగినట్లు చూపిీంచడానికి తెలుగుదేశం పార్టీ దాని అనభంద మీడియా 9 ఏళ్లుగా ఎందుకు ప్రయత్నిస్తోంది.భారతీ సిమెంట్ సంస్ద విషయానికి వస్తే ఆ సంస్దలో మెజారిటి వాటాను గతంలోనే ఫ్రాన్స్ కు చెందిన అంతర్జాతీయ వ్యాపారదిగ్గజం వికా కొనుగోలు చేసింది.వికా ఆ రేటుకు కొనుగోలు చేయడం తప్పని గాని, వికా నుంచి నల్లధనం వచ్చిందని చెప్పే అవకాశమే లేదు.అలాంటి ప్రయత్నం సిబిఐగాని, ఈ డి గాని చేయలేదు.మరి వికా సంస్దకు అమ్మగా వచ్చిన సొమ్ము,అది కూడా మొత్తంగా పన్నులు కట్టిన డబ్బుని ఏ రకంగా అవినీతి సొమ్ము అవుతుంది.దయచేసి చెప్పాలి.ఇందులో చట్టబద్దం కానిది ఏముందో ఆ పత్రికలు చెప్పాలి.లేదా ఈడి చెప్పాలి దిస్ ఈజ్ వెరిమచ్ లీగల్ .తెలుగుదేశం పార్టీ అటు బిజేపితోను ఇటు కాంగ్రెస్ తోను ఏకకాలంలో చాటుమాటు మంతనాలు జరుపుతోంది.కాబట్టే జగన్ గారి మీద కేసు వేసి ,సిబిఐ దర్యాప్తు ముగిసిన తర్వాత,ఛార్జీ షీట్లు దాఖలు చేసిన తర్వాత 2011 ఆగష్టు 10న ఈ కేసు ప్రారంభం అయితే 2018 ఆగష్టులో అంటే కేసు ప్రారంభమయిన ఏడేళ్ల తర్వాత ఆయన భార్య మీద కూడా అదికూడా ఈడి ఛార్జ్ షీట్ వేస్తున్నారంటే రాజకీయంగా దిగజారుడు తనం ఇంతకంటే ఏముంటుందో అర్దం చేసుకోవచ్చు.
జగన్ గారిపై కేసు వేయడంలో ఆరోజున కాంగ్రెస్ తో కుమ్మక్కు అయ్యారు. ఉమ్మడిగా కేసు వేసి ఆయన అరెస్ట్ వరకు తీసుకువెళ్లారు.90 రోజుల్లోపు బెయిల్ రావాల్సి ఉన్నా కూడా అలాంటింది ఏమి లేకుండా చంద్రబాబు,సోనియాగాంధి కలసి ఆ నిభందనలను పక్కన పెట్టి ఛార్జీ షీట్ వేయకుిండా 16 నెలలు అరెస్ట్ లో ఉంచారు.ఇలా ఎక్కడ ఉంది. ఏ చట్టంలో ఉంది. దయచేసి చెప్పాలి ఇది ఇన్ డి క్టివిటి కాదా అని.గత నాలుగేళ్లుగా చంద్రబాబు ఎజెండా ఒక్కటే.ఎట్టిపరిస్దతులలో కూడా జగన్ ను ఏదోవిదంగా కేసులో ఇరికించి వైఎస్ ఆర్ కుటుంబసభ్యులను అబాసు పాలు చేయాలని నీ ప్రయత్నం.
ఏమండి చంద్రబాబు రా…నీకు మగతనం ఉంటే తేల్చుకుందాం…ఇప్పుడు క్షేత్రస్దాయిలో జరుగుతుంది కదా….పోరాటం…రేపు ఎన్నికల జోన్ లో కి ఎంటర్ అవుతున్నాం..నీ ఉద్దేశ్యం.జగన్ ను రాజకీయంగా అడ్డుతొలగించుకోవాలనే కదా.అడ్డుతొలగించుకోవాలంటే అది నీకు సాద్యం కాదు బాబు.ప్రజలు చేయాలి.రేపు ప్రజలు తీర్పు చెబుతారు.దానికోసం తప్పుడు వ్యవహారాలు చేస్తున్నావు.ప్రజలు గమనిస్తున్నారు.దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ సంస్దలను, వ్యవస్దలను వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి వ్యతిరేకంగా ఈనాడు మీరు ఉపయోగించడం.దానికితోడు రాష్ర్ట ప్రయోజనాలను తాకట్టుపెట్టి తన రాజకీయప్రయోజనాలైన తనను కాపాడుకోవడం,ప్రత్యర్దిని దెబ్బతీయడం. మీపై నేరుగా ఉన్నఆడియో వీడియో కేసులుగాని, అవినీతి కేసులు గాని విచారణకు రాకుండా చేయటం.ఈ రెండే లక్ష్యాలుగా చంద్రబాబు ఎజెండా కాబట్టి కేంద్రంలోని రెండు ప్రదాన పార్టీలతో 2009 నుంచి ఈ రోజు వరకు తెరవెనుక ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ చేస్తూనే ఉన్నారు.ఇది ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు.ఇది ఎంతమాత్రం కూడా క్షమించలేనటువంటిది.శ్రీమతి భారతిగారిని కూడా చార్జ్ షీట్ లో చేర్చాలన్న వాదన ఈడి చేయడం వెనక ఉన్నది చంద్రబాబు,ఆయన పిరికి రాజకీయం ఇంతే అని మనకు అర్దమవుతుంది.నేను ఒక్కటే అడుగుతున్నాను.కేంద్రంపై రాష్ర్ట సమస్యలకోసం పోరాడండి…ఉద్యమించండి….ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయండి.అంతేగాని వ్యక్తులను నేరుగా టార్గెట్ గా చేసి రాజకీయంగా అడ్డుతొలగించుకోవాలని చెప్పి ఇలాంటి పనికిమాలిన కేసులు పెట్టడం మంచిదికాదు చంద్రబాబు.
వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలోని మహిళపై కూడా కేసులు పెట్టడానికి వెనకాడటం లేదంటే ఎక్కడ కెళ్తున్నారు.ఏం చేస్తున్నారో అర్దమవుతుందా?
చంద్రబాబు నాయుడుగారికి సుప్రీంకోర్టు ఈ మద్య సమన్లు జారీచేసింది.ఆంద్రప్రదేశ్ లో అవినీతి గురించి ఎన్నోసంస్దలు పుంకాను పుంఖాలుగా వెల్లడిస్తున్నాయి. నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్,సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ ,అమ్నెస్టీ ఇంటర్ నేషనల్ వంటి స్వచ్చంద సంస్దలు టాప్ ర్యాంకులు ఇచ్చాయి.కాగ్ నివేదికల్లో సైతం అవినీతి బయటకు వస్తుంది.ఇవన్నీ విచారణకు ఎందుకు వెళ్లడం లేదంటే చంద్రబాబు ఎంతగా వ్యవస్దలను మేనేజ్ చేస్తారో క్లియర్ గా అర్దమవుతుంది.వ్యవస్దలను మేనేజ్ చేయడానికి సుజనాచౌదరిని కేంద్రంలో మంత్రిగా చేశారు.ఇప్పుడు కేంద్రంలో ఆయనకు అదే పని.ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్ట్ రేట్ నేరుగా ఆర్దికశాఖమంత్రి,ప్రధాని చేతులలో ఉంటాయి.మేం ఏనాడు లొంగలేదు కాబట్టే ,బిజేపితో మాకు ఎలాంటి తెరవెనుక వ్యవహారాలు లేవు కాబట్టే తెలుగుదేశం పార్టీకి రాజ్ నాధ్ సింగ్ తోను,నితిన్ గడ్కరీతోను మహా రాష్ట్ర బిజేపి నాయకత్వంతోగాని నిర్మలాసీతారామన్ తో గాని బలమైన భందం ఉంది వారికి.ఈ కేసులు ఇలా కుటుంబాల్లోచివరకి మహిళమీద కూడా అదీ ఏడేళ్ల తర్వాత మీరు ఈ కేసులను మీరు పెడుతున్నారంటే ఏమనుకోవాలి చంద్రబాబు.అందుకే ఆర్దికమంత్రి అరుణ్ జైట్లీ చాలా స్పష్టంగా చెప్పారు.చంద్రబాబు మాకు శాశ్వత మిత్రుడని,రాజ్ నాధ్ సింగ్ కూడా అదే చెప్పారు.అందుకే మీకు ఈ సందర్బంగా మనవి చేస్తున్నాను.చంద్రబాబుకు బాగా అర్దమైంది…జగన్ ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే మళ్లీ జీవితంలో ఎదిరించలేమనే కక్షతో ఇవన్నీ చేస్తున్నారని.ఏనాడు ప్రభుత్వంలో లేని జగన్ గారిని విచారణలోకి లాగి ఆయన కుటుంబసభ్యుల్నికూడా కేసులలోకి లాగుతున్నారు.తెలుగుదేశం పార్టీ అటు బిజేపితో ఇటు కాంగ్రెస్ తో చాటుమాటు సంసారం చేస్తోంది..అది అందరికి తెలిసిందే.అందుకే బిజేపితో చాటుమాటు సంసారం కారణంగానే బిజేపి వారు చంద్రబాబు కుంభకోణాలు ఇవి అంటూ ప్రెస్ మీట్ లకే పరిమితం అవుతున్నారు. …టిడిపి కూడా ఉత్తుత్తి బెదిరింపులతో కాలం గడుపుతోంది.చాలా స్పష్టంగా ఈరోజు వస్తున్న అవినీతి ఆరోపణలపై ఓటుకునోటునుంచి పోలవరం, రాజధాని,ఉపాది హామీ,లంచాలు,పిడి అకౌంట్లవరకు ఏ ఒక్క విషయంలో కూడా విచారణకు ఆదేశించకుండా చంద్రబాబుపై ఈగవాలకుండా ఎలా ఉంటారు.ఏడేళ్ల తర్వాత కూడా శ్రీమతి భారతి గారి పేరును ఛార్జ్ షీట్ లో ఎలా పెడతారు.దానిలో పెట్టకముందే ఎల్లో మీడియాకు ఎలా వచ్చింది ఈ సమాచారం.ఈ విధమైన లాలూచి పడటంతోనే టిడిపిని కాంగ్రెస్ తో విలీనం చేసే పనిలో చంద్రబాబు ఉన్నారు.రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ ఎన్నికలో టిడిపి, కాంగ్రెస్ అభ్యర్దికి ఓటు వేసింది.మేం ఎవరికి కూడా ఓటు వేయలేకపోయాం.ఎందుకంటే కాంగ్రెస్,బిజేపి ఈ రెండు పార్టీలు ఆంధ్రప్రదేశ్ ను మోసం చేసాయి.ఆనాడు ప్రణబ్ ముఖర్జీకి లేఖలు ఇవ్వడం,ప్రధాని మన్మోహన్ సింగ్ కు లేకఇవ్వడం,సోనియా గాంధితో మంతనాలు జరపడం అవన్నీ చంద్రబాబు చేయడం వల్ల రాష్ర్ట ప్రయోజనాలు, రాష్ర్ట ప్రగతి తీవ్రస్దాయిలో దెబ్బతిన్నాయి.బిజేపిని కూడా మేం పూర్తి స్దాయిలో వ్యతిరేకిస్తున్నాం.ఎందుకంటే విభజన హామీలు ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసింది.కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక భావజాలంతో పుట్టిన టిడిపిని చంద్రబాబు పూర్తిగా కాంగ్రెస్ కు తాకట్టు పెట్టారు.దాంతో కలసి ఇలాంటి కుట్రలకు తెరలేపారు.ఏనాడో ఫ్రాన్స్ కు చెందిన సంస్ద భారతి సిమెంట్ వాటాలను కొనుగోలు చేస్తే బ్లాక్ మెయిల్ చేసి జగన్ గారి మానసిక స్దైర్యం దెబ్బతీసే కుటిల ప్రయత్నంలో భాగంగా భారతి గారిపై కేసు పెట్టారు..గౌరవ ప్రదంగా ఉన్న మహిళపై చార్జ్ షీట్ ఫైల్ చేయిస్తారా?
తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు చంద్రబాబు నిర్ణయించారు.రామారావుగారి పిల్లలు పార్టీ పగ్గాలు చేపట్టండి అని గతంలో ఇక్కడనుంచే ప్రెస్ మీట్ లో చెప్పాను.ఇప్పుడు అదే జరుగుతోంది అని తమ్మినేని అన్నారు.
ఈనాడు మీకు కావాల్సిన విధంగా వైసిపిని దెబ్బతీసే ప్రయత్నం ఇది కాదా?టిడిపి అనుభంద సంస్దగా యాక్ట్ చేస్తున్నారు లేదంటే ఇలాంటి సమాచారం ముందుగా మేడం బారతి గారికి రాకుండా ఆ పత్రికలకు ఎలా తెలసిింది.
మీడియా సంస్దలకు ఎలా తెలిసింది.కుహనా రాజకీయాలతో మీరు వెళ్తున్నారు.మీ తాలుకా కుట్ర రాజకీయాలు సాగుతున్నాయి కాబట్టి జగన్ గారు ఆనాడే ప్రధాని మంత్రికి ఈడి అదికారులపై ఫిర్యాదు చేసారు.వీటికి భయపడే ప్రసక్తి లేదు.జగన్ గారిని మీరు కేసులు పెట్టి భందించాలనుకున్నారు.నిర్భిందించాలనుకున్నారు.ఆయన ధైర్యంగా, నిజాయితీగా వాటిని ఎదుర్కొంటున్నారు.భారతి మేడం గారు గాని ,జగన్ గారు గాని సరైేన రీతిలో ఎదుర్కొంటున్నారు.బారతి గారిపై కేసులు పెట్టడానికి కారణం ఆమె ఎండిగా ఉన్న సాక్షి పత్రిక ఎలాంటి వత్తిడులుకు గాని, బెదిరింపులకు గాని లొెంగకుండా ముందుకు దూసుకుపోతుంది.ఈనాటి ప్రభుత్వం దుర్మార్గాలను,అవినీతిని దోపిడీని నిర్బయంగా బయటపెడుతోంది.జనం పక్షాన నిలబడి సాక్షి చెబుతుంది కాబట్టే భారతి గారినిదెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు.వ్యక్తిగత కక్ష సాదింపు చర్యలను విడిచిపెట్టాలి.ఐదుకోట్ల ప్రజానీకం చూస్తున్నారు.జగన్ గారు ప్రజామద్దతుతో బయటకు వస్తారు.ఆమెపై కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.ప్రభుత్వంలో అవినీతి జరిగితే మీ పత్రికలు వాటిని ప్రజలకు తెలియనీయకుండా చంద్రబాబు ఇంద్రుడు చంద్రుడు అంటూ మీరు చెబుతుంటే అదికాదు వాస్తవం ఇది అని సాక్షి చెబుతుంది కాబట్టే ఆ పత్రిక ఎండి అయిన బారతిగారిపై ఇలాంటి వాటికి ఒడిగడుతున్నారు.భారతీ సిమెంట్ నిజాయితీగా కొనసాగుతున్న సంస్ద.జగన్ గారు గతంలో టిడిపికి అనుకూలంగా ఉన్న అధికారులపై
ప్రధాని గారికి లేఖ ఇచ్చారో ఆ లేఖ సారాంశాన్ని అర్దం చేసుకుని తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నాము. అవాస్తవాలతో కేసులు పెట్టడం వల్ల జగన్ గారిపై కేసులు ఎలా వీగిపోతున్నాయే వీటి విషయంలో కూడా అదే జరుగుతుంది.జగన్ గారు వెనకకు పోయే మనిషి కాదని ఏపిలో అందరికి తెలుసు.ఇలాంటి కేసులు వేయడం మానుకోవాలని సూచిస్తున్నాను.పలు కేసులుకు సంబందించి సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది . జగన్ గారికి ఇంక మనం ఏమి చేయలేమని అందుకే ఇలాంటి వాటికి ఒడిగ
డుతున్నారు.గతంలోనే భారతి గారిపై కేసు పెడదామని చూసినా సిబిఐకి ఎలాంటి ఆధారాలు లేక ఛార్జ్ షీట్ లో పేర్కొనే అవకాశం లేకుండా పోయింది.ఏదిఏమైనా చివరకు న్యాయం గెలుస్తుంది నీతి నిలబడుతుంది.అని స్పష్టం చేసారు.చంద్రబాబు కుట్రలు ప్రజలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని తమ్మినేని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here