సీనియర్ ఎన్టీఆర్ కి..జూ.ఎన్టీఆర్ బర్త్ డే గిఫ్ట్!

99

 

Janatha-Garageస్వర్గీయ నందమూరి తారక రామారావు బర్త్ డేకి జూ.ఎన్టీఆర్ ఓ మంచి గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఆయన బర్త్ డేకి ఇంకా నెల రోజులు సమయం వున్నా… అప్పటికి ఓ మంచి వండర్ ఫుల్ గిఫ్ట్ అభిమానులకు ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు ఈ చిన్న ఎన్టీఆర్. అదేంటి అంటే…
ఎన్టీఆర్-కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘జనతా గ్యారేజ్’ ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ప్రధాన తారాగణం అంతా పాల్గొన్న సన్నివేషాలను చిత్రీకరించే షెడ్యూల్ స్టార్ట్ అయింది. నాన్నకు ప్రేమతో లాంటి హిట్ మూవీ తరువాత ఎన్టీఆర్… అలాగే శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుందని సినిమా ప్రారంభోత్సవం రోజే ప్రకటించింది చిత్ర యూనిట్. దాంతో ఇక టైం దగ్గర పడుతున్న కొద్ది… ఎన్టీఆర్ తీరిక లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
ఈ చిత్రం ఫస్ట్ లుక్.. టీజర్ విడుదల తేదీ ఎప్పుడనేది తెలిసింది. మే 20వ తేదీన జూ.ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ ను విడుదల చేసి.. అభిమానులను ఆనందంలో ముంచెత్తాలని చూస్తోందట చిత్ర యూనిట్. అలాగే మే 28వ తేదీన సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు ఎన్టీఆర్. ఒకే నెలలో రెండు సార్లు అభిమానులను అలరించాలని చూస్తున్నాడు ఈ నందమూరి చిన్నోడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here