సీఎం సీటు జగన్‌కి పర్మినెంట్ కాదు: కేశినేని నాని

392

సీఎం జగన్మోహన్ రెడ్డి పచ్చి మోసకారని టీడీపీ ఎంపీ కేశినేని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా జగన్ విఫలమయ్యారన్నారు. 22 మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని ఇప్పుడు మాట్లాడంటం లేదన్నారు. కేసులు నుండి బయట పడటానికి కేంద్రంతో లాబీయింగ్ చేశారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలకు కాదని చెప్పారు. సీఎం సీటు జగన్‌కి పర్మినెంట్ కాదన్నారు. హిట్లర్ లాంటి వాల్లే కాలగర్భంలో కలిశారని గుర్తుచేశారు. జగన్ మోహన్ రెడ్డి చరిత్ర అంతకంటే హీనమన్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తే ప్రజలు తగిన సమయంలో బుద్ది చెప్తారని మండిపడ్డారు. చంద్రబాబు మీద నమ్మకంతో ఆనాడు రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని గుర్తుచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here