సీఎం సభలో రాయలసీమ వాదుల హాల్ చల్

19

 

అనంతపురం జిల్లా పెనుగొండ లో కీయా కార్ల పరిశ్రమ శంకుస్థాపన సభలో రాయలసీమ వాదులు సీమ ఆకాంక్షలైన హై కోర్ట్, గుంతకల్లు రైల్వే జోన్, కడప ఉక్కు లాంటి ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. విభజన తరువాత సీమను విస్మరించి అభివృద్ధి అంతా ఒక ప్రాంతంలోనే కేంద్రీకరిస్తూ ముందుకు పోతున్న ప్రభుత్వం తీరుకు సమర్ధనీయం కాదని రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ నాయకులు నాగార్జున రెడ్డి, సీమ కృష్ణ లు తెలిపారు.
భవిష్యత్ లో హై కోర్ట్ మరియు రాయలసీమ సమస్యల పరిష్కారం కొరకు ఉద్యమం మరింతగా తీసుకెలుతాం అని పేర్కొన్నారు. అరెస్ట్ అయిన రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ నాయకులు తిప్పిరెడ్డి నాగార్జున రెడ్డి, కృష్ణా నాయక్, బాషా, భాస్కర్ రెడ్డి, కుమార్ నాయక్, బగ్గీ లను స్థానిక పెనుగొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here