సీఎం జగన్‌ పాలన అద్భుతం: గణపతి సచ్చిదానంద

87

ఆంధ్రప్రదేశ్‌లో ప్రాథమిక విద్యను ఇంగ్లీష్‌ మీడియం బోధించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అవధూత దత్తపీఠం వ్యవస్థాపకులు గణపతి సచ్చిదానంద స్వామి స్వాగతించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు. ఇంగ్లీష్‌ మీడియం చదవులు వల్ల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని, అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోగల సత్తా వస్తుందని గణపతి సచ్చిదానంద అభిప్రాయపడ్డారు. పవిత్ర గంగానదిలో కాశీ విశ్వేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సచ్చిదానంద స్వామి అందులో భాగంగా శనివారం అతిరుద్రయాగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక కల్యాణం, ప్రజా సంక్షేమం కోసమే అతిరుద్ర యాగం నిర్వహించినట్లు తెలిపారు. హిందుధర్మ పరిరక్షణ అందరి బాధ్యత అని అన్నారు. ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాలన అద్భుతంగా ఉందని, వారసత్వ అర్చకత్వంపై ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా సీఎం జగన్‌ పాలన ఉందని కొనియాడారు. కాగా ప్రకృతి వైపరీత్యాల నివారణ కోసం చేపట్టిన అతిరుద్ర యాగానికి పలువురు భక్తులు హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here