సీఎం జగన్‌ ఉన్మాదిలా మారారు;చంద్రబాబు

118

కడప జిల్లా పర్యటనలో మూడవరోజు వైసీపీ మంత్రులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలపై మండిపడ్డ చంద్రబాబు. రాష్ట్ర మంత్రులు దిగజారి మాట్లాడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆక్షేపించారు. ‘నాలుగు లక్షల మందికి గ్రామ వలంటీర్లు ఇచ్చాం.. 1.25 లక్షల మందికి గ్రామ సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం.. యువకులంతా చప్పట్లు కొట్టాలని ఓ మంత్రి అంటున్నారు. అలా కొట్టని వారు పశువులతో సమానమట! గ్రామ వలంటీర్లు, సచివాలయ ఉద్యోగాలు ఎవరికిచ్చారు..? మీ కార్యకర్తలకు ఇస్తే 42 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఇచ్చినట్లేనా..? మీరేది మాట్లాడితే దానికి చప్పట్లు కొట్టాలా? ఆ గుడి నీ అమ్మ మొగుడు కట్టించాడా అని మరో బూతుల మంత్రి అంటున్నాడు. ఏం మాట్లాడుతున్నారు వీళ్లు. వీళ్ల మాటలు, భాష చూస్తుంటే బాధేస్తోంది. తిరిగి ఏమైనా అనాలంటే సంస్కారం అడ్డు వస్తోంది.

వీళ్లతోనా రాజకీయాలు చేయాల్సింది’ అని ఆవేదన వ్యక్తంచేశారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారమిక్కడ వైసీపీ దాడుల బాధితులతో చంద్రబాబు మాట్లాడారు. సీఎం జగన్మోహనరెడ్డి ఉన్మాదిలా మారాడని మండిపడ్డారు. తెలుగుదేశం కార్యకర్తలను తన దారికి తెచ్చుకోవడానికి దౌర్జన్యాలు చేస్తున్నారని.. మాట వినకపోతే భౌతికదాడులు.. ఆర్థిక మూలాలపై దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘రాష్ట్రంలో 640 మందిపై దాడులు చేశారు.. కడప జిల్లాలో 52 మందిపై దాడులు, దౌర్జన్యాలు చేశారు. తమకు అన్యాయం జరిగిందని టీడీపీ కార్యకర్తలు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే.. పోలీసులు వైసీపీ నాయకుల నుంచి కౌంటరు ఫిర్యాదులు తీసుకుని టీడీపీ కార్యకర్తలపై నాన్‌బెయిలబుల్‌ కేసులు పెడుతున్నారు. కొందరు పోలీసు అధికారులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here