సీఎం జగన్‌పై జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

55

మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తమను పార్టీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని.. తాము పార్టీలో చేరితే కేసులుండవని చెబుతున్నారని ఆరోపించారు. కొందర్ని ఆర్థికంగా, మానసికంగా శిక్షిస్తున్నారని..

చింతమనేనిపై రోజుకో కేసు పెడుతున్నారని మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన జగన్‌పై ఆరోపణలు చేశారు.

దివాకర్ ట్రావెల్స్ బస్సుల సీజ్‌పై కూడా జేసీ మండిపడ్డారు.

కొందరు నేతల్ని సీఎం టార్గెట్ చేసుకున్నారని.. దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన 80 బస్సులు సీజ్ చేశారన్నారు.

74 ఏళ్ల ట్రాన్స్‌పోర్ట్‌లో తనకు అనుభవం ఉందని.. ఒక్క దివాకర్‌ ట్రావెల్సే నిబంధనలు అతిక్రమించిందా అంటూ ప్రశ్నించారు.

మిగిలిన వాళ్ల బస్సులు ఎన్ని సీజ్‌ చేశారు.. ట్రిబ్యునల్ బస్సులను వదిలిపెట్టమని చెప్పినా ఆర్టీవో అధికారులు విడిచిపెట్టడం లేదన్నారు.

జగన్ హద్దు మీరి పాలన సాగిస్తున్నారన్నారని.. రాష్ట్రంలో కొందరిని లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతున్నారని ఆరోపించారు దివాకర్‌రెడ్డి.

రాబోయే రోజుల్లో ఇది మరింత ఎక్కువ అవుతుందన్నారు.

మైనింగ్‌పై కూడా కేసులు పెడుతున్నారని చెప్పుకోచ్చారు.

అంతేకాద ప్రభుత్వం చెప్పినట్లు వినాల్సిన పరిస్థితి ఉందని అధికారులు చెబుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్ చెప్పినట్లు వినకపోతే.. సీఎస్‌ను బదిలీ చేసినట్లే తమను కూడా బదిలీ చేస్తారని అధికారులు భయపడుతున్నారన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here