సీఎం జగన్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం!

40

వాస్తవానికి ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రవీంద్రను ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్‌గా తెచ్చేందుకు సీఎం జగన్ తీవ్రంగా ప్రయత్నించారు. అయితే అప్పుడు సర్కార్ విజ్ఞప్తిని పక్కన పెట్టిన కేంద్రం ..ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర నియమించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాస్తవానికి ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రవీంద్రను ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్‌గా తెచ్చేందుకు సీఎం జగన్ తీవ్రంగా ప్రయత్నించారు. అయితే అప్పుడు సర్కార్ విజ్ఞప్తిని పక్కన పెట్టిన కేంద్రం ..ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా, గతంలో వైఎస్ హయాంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఛీప్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా స్టీఫెన్ రవీంద్ర పనిచేశారు. రాయలసీమలో కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. 1990 బ్యాచ్‌కు చెందిన రవీంద్ర… సర్దార్ వల్లభాయ్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. గత ఏడాది తెలంగాణలో చోటు చేసుకున్న ఐటీ గ్రిడ్ చోరీకి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కు కూడా స్టీఫెన్ రవీంద్ర ఇంఛార్జ్‌‌గా వ్యవహరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here