సిలిండర్ లీకవ్వడం వల్లే ప్రమాదం… సీఎం

rajahmundryhotelfire2015-171519రాజమండ్రిలో పుష్కరఘాట్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలినికి చేరుకున్న ఆయన పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పుష్కరాలకు వచ్చిన భక్తులకు భరోసా నింపేందుకు యత్నించారు. బస్టాండ్ సమీపంలోని ఓ రెస్టారెంట్‌లో సిలిండర్ లీకవ్వడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలిసినట్లు బాబు తెలిపారు. ఈ ఘటనపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎక్కడి వారు అక్కడే ప్రశాంతంగా ఉండాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *