సినీనటులు ప్రధానిపై ఒత్తిడి తేవాలి: సుమన్

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని నటుడు సుమన్ డిమాండ్ చేశారు.టాలీవుడ్ ప్రముఖులు కూడా ఢిల్లీ వెళ్లి ప్రత్యేక హోదా కోసం ప్రధానిపై ఒత్తిడి తేవాలని సుమన్ అన్నారు.శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని నటుడు సుమన్ దర్శించుకున్నారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారని తెలిపారు.ప్రధాని మోదీకి భగవంతుడు మంచి మనసు ప్రసాదించి హోదా ఇచ్చేలా చూడాలని సుమన్ ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *