సిగ్గు పడాల్సింది శ్రీరెడ్డినా?.. చిత్ర పరిశ్రమనా ?

ఒక అమ్మాయి తాను మోసపోతున్నాను న్యాయం చేయండి అని పోరాటం చేస్తే కడుపుకు అన్నం తినే వారు ఎవరైనా అండగా నిలబడాలి. చిత్రపరిశ్రమ కాబట్టి కనీసం నిలబడినట్టు నటించాలి. కానీ నెల రోజులుగా ఒక అమ్మాయి పోరాటం చేస్తూ చిత్ర పరిశ్రమకు విన్నవించినా పట్టించుకోకపోతే విసుగు వచ్చి, ఆమె అర్థనగ్నంగా నిలబడగానే ”మా” ప్రెస్ మీట్ పెట్టి మరి ఆమెకు సభ్యత్వం ఇవ్వమని ప్రకటించడం చిత్రపరిశ్రమలో పెత్తందారి వ్యవస్థ స్పష్టంగా అర్థమవుతోంది.

శ్రీరెడ్డి చర్యను పక్కన పెడితే.. ఇకపై చిత్రపరిశ్రమలోకి అమ్మాయి ఎంటరవాలంటే చిత్రసీమ కామాంధులు వేదించినా సరే ప్రతిఘటించకూడదన్న మాట. ఇక శ్రీరెడ్డి అర్థనగ్న ప్రదర్శనతో పరువు పోయిందని సినిమా వాళ్లు చెప్పడం విచిత్రం. సినిమాలో హీరోయిన్ల బట్టలు విప్పేసి, ఇష్టంవచ్చిన చోట పూలు పండ్లు విసిరి, శృతి మించిన అశ్లీలతను చూపిస్తూ కాసులు ఏరుకోవడం సినిమా ప్రపంచం ఏనాడో మొదలుపెట్టింది దానికి కదా తొలుత సిగ్గుపడాలి.

ప్రతి సంస్థలోనూ మహిళలపై లైంగిక వేధింపుల నిరోధానికి కమిటి ఉండాలని సుప్రీం కోర్టే చెప్పింది. అలాంటి మహిళా కమిటీని ఏర్పాటు చేసుకోలేని చిత్రపరిశ్రమనే మొదట సిగ్గుపడాలి.

Source: Rami Konijeti

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *