సింధుకు చంద్రబాబు అభినందన

46

హోరాహోరీగా సాగిన రియో ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్‌‌లో తెలుగింటి ఆడబిడ్డ పూసర్ల వెంకట సింధు రజత పతకం సాధించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హర్షం ప్రకటించారు. ఆటలో సింధు చూపిన పోరాట పటిమ నూరుకోట్ల భారతీయులకు స్ఫూర్తి నిలిపిందని ఆయన చెప్పారు. స్వర్ణం కోసం తుది వరకు పోరాడిన సింధు తెలుగు యువతరానికి గర్వకారణంగా నిలిచిందని ప్రశంసించారు. రియో ఒలింపిక్స్‌లో సింధు ప్రదర్శన యావద్ధేశానికి కొండంత బలాన్నిచ్చిందని, సింధును ఒలింపిక్స్‌లో ఫైనల్స్ వరకు చేర్చిన ఆమె గురువు, కోచ్ పుల్లెల గోపీచంద్‌ను కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. తన హయాంలోనే హైదరాబాద్‌లో గోపిచంద్ అకాడమీకి స్థలం కేటాయించి ప్రోత్సహించిన విషయాన్నిముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here