సింగపూర్‌ చేరుకున్న చంద్రబాబు

39

ప్రపంచ నగరాల సదస్సులో పాల్గొనేందుకు తరలివెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్‌ చేరుకున్నారు.ఈ సందర్భంగా సీఎంకు అక్కడి తెలుగు అసోసియేషన్‌ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. మూడు రోజుల పాటు సీఎం సింగపూర్‌లో పర్యటించనున్నారు. ప్రపంచ నగరాల సదస్సులో భాగంగా కొన్ని ముఖ్యమైన సమావేశాలు, బృంద చర్చల్లో పాల్గొనడంతో పాటు, పట్టణ, నగరీకరణకు సంబంధించిన అంశాలపై కీలక ప్రసంగాలు చేయనున్నారు. వివిధ దేశాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వాధినేతలతోనూ భేటీ కానున్నారు.ముఖ్యమంత్రితో చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు, సీఆర్‌డీఏ, ఏడీసీ, ఈడీబీకి చెందిన అధికారులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here