సింగపూర్‌లో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నా చంద్రబాబు

27

 

ఆంధ్రప్రదేశ్‌తో వ్యవసాయ రంగం చురుగ్గా వుందని శుక్రవారం సింగపూర్‌లో బార్ల్కేస్ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

వృద్ధి చెందుతున్న సేద్యపు రంగం కోసం ప్రభుత్వపరంగా శీతల గిడ్డంగులు, రవాణా, మార్కెటింగ్ వంటి మౌలిక సదుపాయాలను పెద్దఎత్తున ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే ఉత్తమ మానవ వనరులు, సహజ వనరులకు ఏపీ పెట్టింది పేరు అని వెల్లడించారు.

రాజధాని నిర్మాణంలో పెట్టుబడిదారులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని వివరించారు. టూరిజం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, ఆతిధ్య రంగం కోసం రాష్ట్రంలో లక్ష హోటల్ రూములు ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

కియా, అపోలో, హీరో, అశోక్ లేల్యాండ్, ఫాక్ప్ కాన్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు రాష్ట్రంలో కొలువుతీరాయని పేర్కొన్న ముఖ్యమంత్రి ఇప్పటివరకు కేవలం ఆటో మొబైల్ రంగంలో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించినట్టు చెప్పారు.

రాష్ఱ్రాభివృద్ధికి నిర్దేశించుకున్న విజన్ 2022, 2029, 2050 లక్ష్యాలను వివరించారు. ల్యాండ్ పూలింగ్, మాస్టర్ ప్లాన్‌లో సింగపూర్ భాగస్వామ్యం, నార్మన్ ఫోస్టర్ డిజైన్ల రూపకల్పన తదితర అంశాలను పేర్కొన్నారు. ఉత్తమ విశ్వవిద్యాలయాలు అమరావతికి వస్తున్న విషయాన్ని రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రస్తావించారు.

రెండంకెల వృద్ధితో ముందుకు దూసుకు వెళుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందిందని ముఖ్యమంత్రి అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ప్రథమ స్థానంలో నిలిచామని, అడ్డంకులు లేని వేగవంతమైన వ్యవస్థ కోసం పనిచేస్తున్నట్టు చెప్పారు.

మీరు వినూత్నంగా ఏమి చేస్తున్నారని సమావేశంలో అడిగిన ఓ ప్రశ్నకు ‘సాంకేతికత అన్ని స్థాయిలలో వినియోగం, రియల్ టైమ్ గవర్నెన్స్, వ్యవసాయ, గ్రామీణ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచేందుకు కృషి జరుపుతున్నాం.’ అని ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు.

రౌండ్ టేబుల్ సమావేశంలో డైమన్ క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ రామన్, బ్లాక్ రాక్ ఏషియా పోర్టు ఫోలియో మేనేజర్ రోనీ గంగూలీ, ఎస్‌బీఐ సింగపూర్ హెడ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అజయ్ కుమార్ సింగ్, బంగ్ సంస్థ డైరెక్టర్ రాజేశ్ రెడ్డి, కార్గిల్ ట్రెజరర్ పరేశ్ బెలానీ, పింకో పోర్టు ఫోలియో మేనేజర్ రోలాండ్ మిత్, లూయీస్ డ్రేఫస్ ప్రతినిధి ఇలానీ ల్వీ,

బ్యాంక్ ఆఫ్ బరోడా సింగపూర్ సీఈవో సునీల్ కుమార్ శ్రీవాస్తవ, ది కార్లిలీ గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ లోపూర్, ఆష్మోర్ పోర్టుఫోలియో మేనేజర్ స్టీఫెన్ లోయి, ఎంఎల్‌పీ పోర్టు ఫోలియో మేనేజర్ ఉథత్య భట్టాచార్య,

గ్రాటిక్యూల్ ఎస్సెట్ మేనేజ్‌మెంట్ ఎండీ వాయ్ హూ లియాంగ్, బార్ల్కేస్ డైరెక్టర్ రాహుల్ బజోరియా, బార్ల్కేస్ చీఫ్ ఇండియా స్టాటజిస్ట్ డెనిస్ టాన్ పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటన బృందంలో ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, పురపాలక శాఖ మంత్రి నారాయణ, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి. సాయి ప్రసాద్, ఏపీ ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణ కిషోర్ వున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here