సప్తగిరి హీరోగా తెర‌కెక్కుతోన్న‌ ‘వజ్ర కవచధర గోవింద’

30

అత‌ని పేరు గోవిందు. ఫన్నీ దొంగ. అత‌నికో లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్య సాధన కోసం ఏం చేశాడన్నది తెలుసుకోవాలంటే `వ‌జ్ర క‌వ‌చ‌ధ‌ర గోవింద‌` సినిమా చూడాల్సిందే అని అంటున్నారు స‌ప్తగిరి. స్టార్ క‌మెడియ‌న్ స‌ప్త‌గిరి ఫ‌న్నీ దొంగ‌గా న‌టిస్తున్న సినిమా `వ‌జ్ర క‌వ‌చ‌ర‌ధ‌ర గోవింద‌`. ఈ సినిమాకు అరుణ్ ప‌వార్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా

చిత్ర ద‌ర్శ‌కుడు అరుణ్ ప‌వార్ మాట్లాడుతూ “నా ద‌ర్శ‌క‌త్వంలో స‌ప్త‌గిరి హీరోగా న‌టించిన `స‌ప్త‌గిరి ఎక్స్ ప్రెస్‌` విడుద‌లై ఎంత పెద్ద విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలిసిందే. తాజాగా రూపొందిస్తున్న `వ‌జ్ర క‌వ‌చ‌ధ‌ర గోవింద‌` అంత‌కు మించి స‌క్సెస్ కావాల‌నే త‌ప‌న‌తో కృషి చేస్తున్నాం. సినిమా చాలా బాగా వ‌స్తోంది. స‌ప్త‌గిరి నుంచి ప్రేక్ష‌కులు ఏం ఆశిస్తారో, ఆ అంశాల‌న్నీ మా సినిమాలో ఉంటాయి. సప్తగిరి వ్యావ‌హారిక శైలికి పర్‌ఫెక్ట్‌గా సూటయ్యే కథ ఇది. మా క‌థ‌కు అనుగుణంగానే ప‌వ‌ర్‌ఫుల్‌గా `వ‌జ్ర క‌వ‌చ‌ధ‌ర గోవింద‌` అనే టైటిల్‌ పెట్టాం. మా నిర్మాత‌లు కొత్త‌వారైనా ఎక్క‌డా కాంప్రమైజ్ కాకుండా సినిమా రూపొందిస్తున్నారు. కడుపుబ్బా నవ్వించే అంశాలతోపాటు, మంచి యాక్షన్, ఎమోషన్, ఇతర వాణిజ్య అంశాలు మెండుగా ఉంటాయి.“ అని అన్నారు.
నిర్మాత‌లు నరేంద్ర యెడల , జీవీఎన్ రెడ్డి మాట్లాడుతూ “మా `వ‌జ్ర క‌వ‌చ‌ధ‌ర గోవింద` షూటింగ్ 80 శాతం పూర్త‌యింది. మిగిలిన స‌న్నివేశాల‌ను కర్ణాటక లోని ఒక గుడిలో తెర‌కెక్కిస్తాం. మా చిత్రానికి చాలా కీల‌క‌మైన ఎపిసోడ్స్ ని 10 రోజుల పాటు ఈ దేవాలయంలో చిత్రీక‌రిస్తాం. మా చిత్ర టైటిల్‌కి ఎక్స్ ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. టైటిల్‌ ప్ర‌క‌టించ‌గానే మా సినిమాపై ఇండ‌స్ట్రీలోనూ, ప్రేక్ష‌కుల్లోనూ అటెన్ష‌న్ బాగా పెరిగింది. `సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ లాంటి సూపర్ హిట్ తర్వాత సప్తగిరి, అరుణ్ పవార్ కాంబినేషన్‌లో సినిమా చేసే అవకాశం మాకు దక్కడం చాలా హ్యాపీగా ఉంది. హిలేరియస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్ర‌మిది`’ అని తెలిపారు.
వైభవీ జోషీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అర్చనా వేద, టెంపర్ వంశీ, అప్పారావు, అవినాష్, రాజేంద్ర జాన్ కొట్టోలి, వీరేన్ తంబిదొరై తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు . ఈ చిత్రానికి కథ: జి టి ఆర్ మహేంద్ర, సంగీతం: విజయ్ బుల్గానిన్, కెమెరా: ప్రవీణ్ వనమాలి, ఎడిటింగ్: కిషోర్ మద్దాలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సలాన బాలగోపాలరావు, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: అరుణ్ పవార్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here