సచిన్ అంటే నాకు ఇష్టం :ఎన్టీఆర్

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంటే తనకు అభిమానమని టాలీవుడ్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు. ఐపీఎల్ మ్యాచ్‌ల తెలుగు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్న జూనియర్ ఎన్టీఆర్..పార్క్ హయత్‌లో జరిగిన ఐపీఎల్ వేడుకలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ సింహాద్రి సినిమా విజయం తొలి సిక్స్ కొట్టినంత ఆనందం ఇచ్చిందన్నాడు. క్రికెటర్ల జీవితాలు సిల్వర్‌స్క్రీన్‌పైకి రావడం ఆనందంగా ఉందని, క్రికెటర్ల బయోపిక్స్ చేయడానికి తాను సాహసం చేయనని చెప్పాడు. ఆట కూడా ఒక భాషే అని తన అభిప్రాయమని, క్రికెట్ సరిహద్దులు లేని ఆట అని అన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *