సంకల్పంతో ముందుకెళ్తున్నాం: చంద్రబాబు

8

రైతుల సంక్షేమం కోసమే కృష్ణమ్మా నదీమ తల్లికి జలసిరి హారతి చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం శ్రీశైలం సంజీవయ్య సాగర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కృష్ణ నది జలసిరి హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో అనుకున్నంత వర్షాలు లేక కరువు తాండవిస్తున్న తరుణంలో పై రాష్ట్రాల్లో కురిసిన వర్షాల వల్ల శ్రీశైల జలాశయానికి అధికంగా నీరు చేరిందన్నారు, వచ్చిన నీటినంత వృధా పోనీయకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసి నీటిని నిలువ చేశామన్నారు. ఈ నీటిని ముచ్చుమర్రి పోతిరెడ్డిపాడు, హంద్రి నివా ద్వార కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలకు నీరు అందిస్తున్నామన్నారు. ప్రజలకు త్రాగునీటి కొరత లేదన్నారు, నదులను అనుసందానం చేయడమే తన సంకల్పమన్నారు, తానూ అనుకున్నది సాదిన్చెంత వరకు నిద్ర పోనన్నారు. జల వనరుల శాఖ ఇంజనీర్ చీఫ్ వెంకటేష్ ను నీటి నిలువ సామర్త్యం గురించి సియం అడుగగా జలాశయంలో 215 టిఎంసిల నీరు ఉందని సిఎం కు వివరించారు. అనంతరం హిందూ, క్రిస్తవ, ముస్లిం మత పెద్దలు సర్వ మత ప్రార్ధనలు చేసారు. ముఖ్య మంత్రి సిఎం మాట్లాడతూ ప్రజలు వర్షం కోసం పూజలు చేయాలన్నారు. ఈ నేల 12వ తేదిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ శాఖ మంత్రి కె.ఇ.కృష్ణ మూర్తి పత్తికొండ మండలంలో వారున యాగం చేయడం వల్ల మంచి వర్షాలు కురిసాయని ప్రతి ఒక్కరు ఆయన స్ఫూర్తితో వారున యాగం చేపడితే వర్షాలు అధికంగా కురుస్తాయన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ శాఖ మంత్రి కె.ఇ.కృష్ణ మూర్తి, జలవనరుల శాఖా దేవినేని ఉమా మహేశ్వర్, జిల్లా ఇంచార్జ్ మంత్రి కాలువ శ్రీనివాసులు, పర్యాటక శాఖా మంత్రి భుమ అఖిల ప్రియ, శాసన మండలి చైర్మన్ ఎనేమ్డి ఫారూక్, ఎమేల్సి కె.ఇ.ప్రభాకర్, శ్రీశైలం ఎమెల్యే బుడ్డా రాజ శేఖర్ రెడ్డి, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పి గోపీనాథ్ జెట్టి, జలవనరుల శాఖా ప్రాజెక్ట్ సిఇ నారాయణ రెడ్డి, ఎస్ఇ వీర రాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శశి దేవి, శ్రీశైలం ఈఓ శ్రీరామ చంద్ర మూర్తి, తదితరులు పాల్గొన్నారు._

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here