శ్రీవారి సేవా సదన్‌ నిర్మాణపనులపై జెఈవో సమీక్ష

తిరుమలలో నిర్మాణంలో ఉన్న శ్రీవారి సేవాసదన్‌ పనుల పురోగతిపై జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల ఐటి కాన్ఫరెన్స్‌ హాల్లో శుక్రవారం ఈ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా జెఈవో విభాగాల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముందుగా ఇఇ-1 శ్రీ ప్రసాద్‌ 3డిలో రూపొందించిన భవనం నమూనాను పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. ఇందులో పలు మార్పులను జెఈవో సూచించారు. నూతన భవనంలో ఆర్‌వో తాగునీటి ప్లాంట్లు, సోలార్‌ హీటర్లు, భవనం చుట్టూ ఆహ్లాదంగా ఉద్యానవనం, సిసిటివిలు, సేవకుల శిక్షణ కోసం ఎల్‌ఇడి స్క్రీన్లు, స్పీకర్లు, అన్నప్రసాద వితరణశాల తదితర వసతులు కల్పించాలని ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారు. భవిష్యత్తులో ఒక రోజుకు సుశిక్షితులైన 2 వేల మంది శ్రీవారి సేవకులను వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని పిఆర్‌వో డా|| టి.రవిని ఆదేశించారు. సీనియర్‌ అధికారుల బృందం ఈ భవనాన్ని కూలంకషంగా పరిశీలించి ఫిబ్రవరి 19న జరిగే సమావేశంలో నివేదించాలన్నారు.

ఈ సమావేశంలో టిటిడి ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, ఎస్‌ఇ(ఎలక్ట్రికల్స్‌) శ్రీ వేంకటేశ్వర్లు, ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, విఎస్‌వో శ్రీ రవీంద్రారెడ్డి, డిఇ(ఎలక్ట్రికల్స్‌) శ్రీమతి సరస్వతి, ఇడిపి ఓఎస్‌డి శ్రీ బాలాజిప్రసాద్‌, ఉద్యానవన విభాగం అధీక్షకులు శ్రీ శ్రీనివాస్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *