శివాజీ జాగరణ దీక్షకు మద్దతు తెలిపిన మంత్రి దేవినేనిఉమా

78


సినీ నటుడు శివాజీ చేపట్టిన జాగరణ దీక్షకు జలవనరుల శాఖా మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు మద్దతు ప్రకటించారు రాత్రి దీక్షా శిబిరానికి వెళ్ళి సంఘీభావం తెలిపిన మంత్రి మాట్లాడుతూ తెలుగుజాతిపై ఈర్ష్యా ద్వేషాలతోనే మోడీ ఏపీకి ద్రోహం చేస్తున్నారని,లక్షలకోట్లు గుజరాత్ కు దోచిపెడుతూ ఏపీకి మాత్రం మొండిచేయి చూపుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేసినా హామీలు నెరవేర్చకపోవడంతోనే బయటకు వచ్చి పోరాటం చేస్తున్నాం నిధులు ఇవ్వకుండా ప్రధాని అడ్డుపడుతున్నారని ముందే కేంద్రం నుండి బయటకు వచ్చిఉంటే పట్టిసీమ, పోలవరం కూడా కట్టనిచ్చేవారు కాదు. తమ పార్టీ తప్ప మరో పార్టీ దేశంలో ఉండకూడదని దుర్బుద్ధితో బిజెపి కుట్రలు చేస్తుందని తెలుగుజాతి ఈ బెదిరింపులకు భయపడదని రాష్ట్రానికి ఎంతో కొంత న్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాడన్న కోపంతో వెంకయ్యనాయుడుని మంత్రివర్గంనుంచి తప్పించారని హోదాకోసం, రాష్ట్రానికి న్యాయం జరగడం కోసం మొదటినుంచీ పోరాడుతున్న శివాజీకి అందరం మద్దతు నివ్వాలని పిలుపునిచ్చారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here