వ్యవసాయంలో గణనీయమైన అభివృద్ధి సాధించాం;సీఎం

90

రాష్ట్రంలో  వ్యవసాయంలో గణనీయమైన అభివృద్ధి సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మంగళవారం వ్యవసాయం-అనుబంధ రంగాలపై అసెంబ్లీలో చర్చలో భాగంగా సీఎం మాట్లాడుతూ 2004 నుంచి 2014 వరకు రైతులు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. ఎరువులు, విత్తనాలు దొరక్క దిగుబడి తగ్గిపోయి రైతులు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. కరెంట్‌ కోసం రాత్రుళ్లు పొలాలకు వెళ్లి చనిపోయిన ఘటనలు ఉన్నాయన్నారు. దేశంలోనే వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ తీసుకొచ్చిన ఘనత టీడీపీదే అని సీఎం తెలిపారు. వ్యవసాయానికి కేటాయింపులే కాకుండా అభివృద్ధి కూడా చేయగలిగామన్నారు. వ్యవసాయంలో వృద్ధి ఏపీలో 11 శాతం ఉండగా, దేశంలో 2.4 శాతంలో ఉందని పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయగలిగామన్నారు. అన్నదాత సుఖీభవ పథకం తీసుకొస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here