వై.సి.పి. పాదయాత్రలతో కరోన వ్యాపించదా?

328

రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినటువంటి సమయంలో ఎన్నికలు నిర్వహించలేమని, కరోనా ఉద్ధృతి ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్నికల సంఘానికి లేఖ వ్రాయడం, రాజ్యాంగబద్ధ సంస్థ యొక్క స్వయంప్రతిపత్తిని ప్రశ్నించడమేనని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ అన్నారు. స్థానిక ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లో నూకసాని బాలాజీ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో ఒక సంక్షోభ పరిస్థితి నడుస్తోందని, ప్రభుత్వం రాజ్యాంగబద్ధ సంస్థలతో ఘర్షణ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటుందని ఇది ఎంతమాత్రం ప్రభుత్వానికి శ్రేయస్కరం కాదని ఆయన హితవు పలికారు. 2020 మార్చి నెలలో కరోనా ఉద్ధృతి ఉందన్న కారణంగా నాడు ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసిందని ఆ తర్వాత దేశంలో కరోనా ఉద్ధృతిని మనం చూశామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టిన పరిస్థితుల్లో ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకి ఏర్పాటు చేసినటువంటి సమయంలో లో కరోనా ఉందని మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. మరి కరోనా ఉందని భావించినటువంటి ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు ఎలా నడుపుతుందని, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు ఎలా ప్రారంభింపజేశారని, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులతో ఎలా పని చేయిస్తున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు. వీటన్నిటి నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు అనుగుణంగానే జరుగుతున్నాయని అదేవిధంగా బీహార్ లో జరిగినటువంటి ఎన్నికలు, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో జరగబోతున్న ఎన్నికలు సైతం కేంద్ర ప్రభుత్వ మార్గ నిర్ధేశాలకు అనుగుణంగా జరుగుతున్నాయనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలని ఆయన అన్నారు. పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు రావాలి అంటే ఎన్నికలు జరగాలని నాడు చెప్పినటువంటి ఈ ప్రభుత్వమే నిధులు రాష్ట్రానికి రావాలంటే ఎన్నికలు జరగాలని ఎన్నికల సంఘం చెప్తున్నప్పటికీ ఈ ప్రభుత్వం విరుద్ధంగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఎక్కడ తమల్ని ఓటమి పాలు చేస్తుందని భయపడుతున్న వైసిపి ఓటమి భయంతో ఎన్నికలు నిర్వహించలేమని చెబుతుందని ఆయన విమర్శించారు. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మీద ఎలా మాట్లాడాలో తెలియని మంత్రి కొడాలి నాని అని, మంత్రులు అలా మాట్లాడుతూ ఉంటే జగన్ మోహన్ రెడ్డి చిద్విలాసంగా చూస్తూ తన మంత్రులను అలా ఎగదోసి వేడుక చూస్తున్నారని విమర్శించారు. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడంలో తెలుగుదేశం పార్టీని బూచిగా చూపిస్తున్నారని, కేవలం రెండు వేల ఎకరాలు మాత్రమే కోర్టులో ఉండగా మిగిలిన భూమిని పేదలకు పంచడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. వై.సి.పి. ప్రభుత్వం ఏ పని చేయాలన్నా తెలుగుదేశం పార్టీని, నారా చంద్రబాబునాయుడుని బూచిగా చూపిస్తూ తప్పించుకొని తిరుగుతుందని ఇది ఎల్లకాలం సాగదని ఆయన అన్నారు.

ఒంగోలు ఏ.ఏం.సి మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు వస్తున్నటువంటి కరోనా వైసిపి చేస్తున్నటువంటి పాదయాత్రల వల్ల రాదా అని సూటిగా ప్రశ్నించారు. పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు అవసరం కాబట్టి రాష్ట్రంలో ఎన్నికలు కచ్చితంగా నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుందని కామేపల్లి శ్రీనివాసరావు అన్నారు.
ఒంగోలు నగర పార్టీ అధ్యక్షుడు కోటారి నాగేశ్వరరావు మాట్లాడుతూ పేదలకు ఇళ్ల పంపిణీకి, ఇళ్ల స్థలాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతుందని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో గృహ సముదయాలను వెంటనే లబ్ధిదారులకు అందించాలని, అలా కాని పక్షంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాలకు అనుగుణంగా సంక్రాంతి పండుగ నాటికి లబ్ధిదారులతో గృహప్రవేశం చేయిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు నావూరి కుమార్, బత్తుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here